Allu Aravind: తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై అల్లు అరవింద్ కామెంట్.. ఏమన్నారంటే?
గత కొంతకాలంగా తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయంలో తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద రగడ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా సమానంగా రిలీజ్ చేయాలని కొందరు వాదిస్తుంటే, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి మాత్రం తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ వివాదంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Allu Aravind Comments On Telugu Producers Council Decision Over Tamil Movies
Allu Aravind: గత కొంతకాలంగా తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయంలో తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద రగడ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా సమానంగా రిలీజ్ చేయాలని కొందరు వాదిస్తుంటే, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి మాత్రం తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు గతంలో ఓ లేఖ కూడా విడుదల చేసింది తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి. దీంతో తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బడా నిర్మాతలు నిర్ణయం తీసకున్నారు.
Allu Aravind : ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌పై అల్లుఅరవింద్ కౌంటర్
అటు కోలీవుడ్‌లోనూ తెలుగు సినిమాలపై ఇలాంటి నిర్ణయాన్నే తీసుకునేందుకు అక్కడి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ వివాదంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అవి జనాలను ఎంటర్‌టైన్ చేస్తున్నాయని.. సినిమాలో కంటెంట్ బాగుంటే, ఏ భాష సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. తెలుగు నిర్మాతల మండలి లేఖపై తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఈ నెల 22న తమిళ నిర్మాతలు ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.
Allu Aravind : ఈ విషయం అందరికీ తెలియాలి.. మెగా ఫ్యామిలీతో బేధాభిప్రాయాలపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..
డబ్బింగ్ సినిమాల రిలీజ్‌ను ఆపడం ఎవరితరం కాదని, సినిమాకు భాషతో సంబంధం లేదని ఆయన అన్నారు. సినిమాలు బాగుంటే ఎక్కడైనా ఆడుతున్నాయని అరవింద్ తెలిపారు. అయితే తెలుగు నిర్మాతల మండలి లేఖకు ముందే తమిళ హీరో విజయ్ నటిస్తున్న వారిసు సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఇక సంక్రాంతి బరిలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, ఇప్పుడు వారిసు రిలీజ్‌పై సందిగ్ధత నెలకొందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎంతదూరం వెళ్తుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేక్షకులు. కాగా, అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.