Allu Arjun : అత్తారింటికి అల్లుఅర్జున్.. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం..

అల్లు అర్జున్‌ సతీమణి బంధువులలో ఒకరు మూడు రోజుల క్రితం మరణించడంతో ఆ కుటుంబ సభ్యులని పరామర్శించడానికి బన్నీ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఆదివారం అల్లు అర్జున్‌ చింతపల్లి గ్రామానికి వచ్చాడని తెలియడంతో..............

Allu Arjun : అత్తారింటికి అల్లుఅర్జున్.. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం..

Allu Arjun at snehareddy relatives village

Updated On : November 29, 2022 / 6:59 AM IST

Allu Arjun :  అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. అలాగే పుష్ప సినిమా రష్యాలో రిలీజ్ అవుతుండటంతో ఆ పనుల్లో కూడా బిజీబిజీగా ఉన్నాడు బన్నీ. తాజాగా అల్లు అర్జున్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. అల్లు అర్జున్‌ తన భార్యతో కలిసి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి వెళ్లారు.

అల్లు అర్జున్‌ సతీమణి బంధువులలో ఒకరు మూడు రోజుల క్రితం మరణించడంతో ఆ కుటుంబ సభ్యులని పరామర్శించడానికి బన్నీ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఆదివారం అల్లు అర్జున్‌ చింతపల్లి గ్రామానికి వచ్చాడని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనాలు వచ్చారు. అల్లు అర్జున్ ని చూడటానికి, ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

Nani : ‘హిట్’ వర్స్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి.. హిట్ 7లో ఏడుగురు హీరోలు ఉంటారు..

అయితే బన్నీ బౌన్సర్లు తో రావడంతో బౌన్సర్లు ఎవ్వరిని దగ్గరికి రానివ్వలేదు, అలాగే బన్నీ కూడా విషాదంలో ఉన్నవాళ్ళని పలకరించడానికి రావడంతో ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, ఫోటోలు ఇవ్వకుండా కొన్ని గంటల పాటు అక్కడే ఉంది వెళ్ళిపోయాడు. కొంతమంది వాళ్ళ అత్తగారి బంధువుల పిల్లలకి ఫోటోలు ఇవ్వడంతో ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.