Nani : ‘హిట్’ వర్స్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి.. హిట్ 7లో ఏడుగురు హీరోలు ఉంటారు..

ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ''హిట్ కంటే హిట్ 2 సినిమా ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. హిట్‌ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. హిట్ 7వ పార్ట్‌లో అన్ని పార్టుల్లో నటించిన హీరోలు.............

Nani : ‘హిట్’ వర్స్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి.. హిట్ 7లో ఏడుగురు హీరోలు ఉంటారు..

Nani speech in Hit 2 Pre release event

Nani :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమా రాబోతుంది. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ”హిట్ కంటే హిట్ 2 సినిమా ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. హిట్‌ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. హిట్ 7వ పార్ట్‌లో అన్ని పార్టుల్లో నటించిన హీరోలు కనిపిస్తారని, వాళ్ళందర్నీ ఒక సమస్య పరిష్కారం కోసం తీసుకొస్తానని నాకు డైరెక్టర్ చెప్పాడు. ఒక నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని తెలిపారు.

BiggBoss 6 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?

దీంతో హిట్ ఫ్రాంచైజ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఏడుగురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.