BiggBoss 6 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?

బిగ్‌బాస్‌ సీజన్ 6 దాదాపు చివరి దశకి వచ్చేసింది. ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఇప్పుడు హౌజ్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఆదివారం రాజ్ ఎలిమినేషన్ తర్వాత సోమవారం నాడు ఎప్పటిలాగే..................

BiggBoss 6 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?

BiggBoss 6 Day 85 nominations day

BiggBoss 6 Day 85 :  బిగ్‌బాస్‌ సీజన్ 6 దాదాపు చివరి దశకి వచ్చేసింది. ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఇప్పుడు హౌజ్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఆదివారం రాజ్ ఎలిమినేషన్ తర్వాత సోమవారం నాడు ఎప్పటిలాగే నామినేషన్స్ జరిగాయి. సీజన్ చివరికి వస్తుండటంతో ఈ వారం నామినేషన్స్ మరింత ఘాటుగా జరిగాయి.

ఈ వారం ఇనయా కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్‌ నుంచి తప్పించుకుంది. ఇక నామినేషన్స్ లో అందరూ రేవంత్, ఆదిరెడ్డిలని టార్గెట్ చేశారు. గతంలో కంటే ఈ వారం నామినేట్ చేసేటప్పుడు గొడవలు ఎక్కువగా పెట్టుకొని ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. రంగు చాల్లే మిషన్ ఒకటి పెట్టి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిపై ఆ మిషన్ తో రంగు చల్లమన్నాడు బిగ్‌బాస్‌.

BiggBoss 6 Day 84 : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??

ఈ వారం ఆదిరెడ్డి.. రేవంత్‌, రోహిత్‌ లని నామినేట్ చేశాడు. ఫైమా.. రేవంత్‌, రోహిత్‌ లని, శ్రీహాన్‌.. రోహిత్‌, ఆదిరెడ్డి లని, కీర్తి.. రేవంత్‌, శ్రీసత్యలని, ​​​​శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డిలని, ​​​​​​రోహిత్‌.. ఆది రెడ్డి, ఫైమాలని, ​​​​​​రేవంత్‌.. ఆది రెడ్డి, ఫైమాలని, ​​​​​​​ఇనయా.. రేవంత్‌, శ్రీసత్యలని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం ఫైమా, రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌, కీర్తి నామినేషన్స్ లో ఉన్నారు. శ్రీహాన్, ఇనయా ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. మరి వారం చివర్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.