COVID Vaccine For Animals : జంతువులకు కరోనా వ్యాక్సిన్..అభివృద్ధి చేసిన హర్యానాకు చెందిన సంస్థ

మనుషులకే కాదు జంతువులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ పూన్తి స్వదేశీయంగా తయారైంది...హర్యానాకు చెందిన సంస్థ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది.

COVID Vaccine For Animals : జంతువులకు కరోనా వ్యాక్సిన్..అభివృద్ధి చేసిన హర్యానాకు చెందిన సంస్థ

Anocovax Indias First Covid Vaccine For Animals

Updated On : June 10, 2022 / 5:28 PM IST

Anocovax Indias First COVID Vaccine For Animals : కరోనాను నియంత్రించటానికి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు దేశ వ్యాప్తంగా ప్రజలు. మరి జంతువులకు కూడా కరోనా మహమ్మారి సోకుతోంది కదా..మరి వాటికి వ్యాక్సిన్ వద్దా? మూగ జీవాలు కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? అంటే కాదు కాదు మనుషుల్లాగానే జంతువులకు కూడా వ్యాక్సిన్ అవసరమే అని ఆలోచించిన హర్యానాకు చెందిన సంస్థ జంతువులకు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. హర్యానాకు చెందిన సంస్థ..పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జంతువుల కోసం కరోనా వ్యాక్సిన తయారు చేసింది. జంతువుల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లకు చెక్ పెట్టటానికి ఈ వ్యాక్సిన్ తయారు చేసింది.

హర్యానాకు చెందిన ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRC) జంతువుల కోసం అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ టీకా ‘అనోకోవ్యాక్స్’ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం (జూన్ 9,2022)ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్స్ కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్‌తోపాటు ఒమిక్రాన్‌ను కూడా సమర్థంగా అడ్డుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) వెల్లడించింది.

కుక్కలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లను కరోనా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడం కంటే సొంతంగా అభివృద్ధి చేయడం నిజంగా పెద్ద విజయమని మంత్రి తోమర్ అన్నారు. అనోవ్యాక్స్‌తోపాటు సీఏఎన్-సీవోవీ-2 ఎలీసా (CAN-CoV-2 ELISA) కిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితంగా శునకాల్లో యాంటీబాడీలను గుర్తించొచ్చు.