church stampede: చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

నైజీరియాలోని చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం ఉదయం ఆహారంతోపాటు, బహమతులు పంపిణీ చేశారు.

church stampede: చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

Church Stampede

Updated On : May 28, 2022 / 9:01 PM IST

church stampede: నైజీరియాలోని చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం ఉదయం ఆహారంతోపాటు, బహమతులు పంపిణీ చేశారు. దీనికి చాలా ముందుగానే ప్రచారం చేశారు. దీంతో ఆహారం, బహుమతులు తీసుకునేందుకు అంచనాలకు మించి వందల మంది తరలివచ్చారు. చాలామంది తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. అయితే, ఎంతసేపటికీ తమ వంతు రాకపోవడం, జనం పెరిగిపోవడంతో తోపులాట జరిగింది.

Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు

చాలా మంది గేట్లు పగులగొట్టుకుని లోపలికి చొచ్చుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 31 మంది మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు చర్చికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పూర్తి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.