Avoid ‘My Lord, Your Honour’ : జడ్జిలను మైలార్డ్, యువరానర్ అని అనక్కర్లేదు..మరి ఏమనాలంటే..
జడ్జిలను లాయర్లు ఇకనుంచి మైలార్డ్, యువరానర్ అని అని సంబోధించవద్దని ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మురళీధర్, జస్టిస్ ఆర్.కె.పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది.

Avoid My Lord, Your Honour
Avoid Addressing Us As My Lord, Your Lordship, Your Honour : కోర్టుల్లో కేసుల గురించి వాదనలు చేసే న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ అనీ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. కానీ ఇకనుంచి అలా మైలార్డ్, యువరానర్ అని అననక్కర్లేదంటూ ఒడిశా హైకోర్టు సోమవారం (జనవరి 3,2022)చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తులను మైలార్డ్, యువరానర్ అని న్యాయవాదులు సంబోధిస్తారని..కానీ ఇక నుంచి దానికి బదులుగా ‘సార్’ అని పిలిస్తే సరిపోతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ ఆర్.కె.పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ‘సార్’ అంటే చాలని ఇతర మర్యాదపూర్వక పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Read more : Kerala High Court సంచలన తీర్పు..అలా ఎక్కడ టచ్ చేసినా రేపే
కాగా..2020లో, పంజాబ్..హర్యానా హైకోర్టులోని న్యాయవాదులు ఆయనను ‘మై లార్డ్’ అని సంభోదించినప్పుడు ఇటువంటివి వద్దని అప్పుడు ఆయన న్యాయవాదులకు సూచించారు. జస్టిస్ మురళీధర్ జనవరి 4, 2021న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. మే 29, 2006 నుండి మార్చి 5, 2020 వరకు ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తిగాను, ఆ తర్వాత మార్చి 6 2020 నుండి జనవరి 3, 2021 వరకు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా ఉన్నారు.
జస్టిస్ మురళీధర్ చేసిన ఈ సూచనపపై ఒరిస్సా హై బార్ అసోసియేషన్ సెక్రటరీ జెకె లెంకా మాట్లాడుతూ.. ప్రధాన న్యాయమూర్తి తీసుకున్న చర్య స్వాగతించదగినదని..ఇతర న్యాయమూర్తులు ఆయనను అనుసరించాలని..న్యాయవాదులు కూడా దీనిని అనుసరించాలని అన్నారు.
Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!
ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతికృష్ణ మిశ్రా (1969-75) హయాంలో న్యాయమూర్తులను ఉద్దేశించి “యువర్ లార్డ్‌షిప్” అనే సంబోధనలు వద్దని అన్నారని ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు.