సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పిల్లలకు పాలు పట్టటానికి స్పెషల్ రూమ్



గది చుట్టూ అమర్చిన క్యూబికల్ సెట్.. రైలు ప్రయాణం చేసే తల్లులు వారి శిశువులకు పాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అలాగే రైల్వే స్టేషన్‌లో 1వ నంబర్ ఫ్లాట్ ఫారం వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇది చిరు ప్రరిశ్రమల వ్యాపారస్తుల అభివృద్ధికి ఈ కేంద్రం తోడ్పడనుంది.
ఈ సందర్భంగా రైల్వే డీఎం కుమార్ గుప్తా మాట్లాడుతూ..రైలు ప్రయాణికులకు వసతులు, సౌకర్యాలు కల్పించడంలో రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. హైదరాబాద్, విజయవాడ డివిజన్ల పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా మరిన్ని కియోస్క్/ క్యూబికల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వీ హనుమంతరావు, దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షురాలు చావి గుప్తా, రైల్వే ఉన్నతాధికారులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.