30లో ప్రేమ.. ఆసక్తికరంగా ‘భానుమతి & రామకృష్ణ’..

ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తదనంతో తెరకెక్కించిన ఈ రొమాన్స్ డ్రామా, తొలి తెలుగు OTT ఆహాలో జూలై 3న వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. గతకొద్ది రోజులుగా ఈ చిత్ర టైటిల్‌పై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. విడుదలకు తక్కువ సమయం ఉండడంతో మూవీ యూనిట్ ఎట్టకేలకు టైటిల్ మార్చింది. ‘భానుమతి & రామకృష్ణ’ గా టైటిల్ మార్చారు. చిన్న మార్పు.. కానీ ఎమోషన్ మాత్రం సేమ్ టు సేమ్ అంటూ టీమ్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక లేటెస్ట్ ట్రైలర్ నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.. గుడ్ లక్ టీమ్ అంటూ నాని చిత్ర బృందాన్ని విష్ చేశారు. భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read:ఆ ఘనత సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మహేష్ బాబు!