Incovacc Booster Dose : బూస్టర్‌ డోస్‌గా ‘ఇన్‌కోవాక్‌’.. సీడీఎస్‌సీవో అనుమతి మంజూరు

ప్రపంచంలోనే తొలిసారి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) అభివృద్ధి చేసిన చుక్కల మందు ‘ఇన్‌కోవాక్‌’ను ఇకపై బూస్టర్‌ డోసుగానూ వినియోగించుకోవచ్చు. ఇది ముక్కు ద్వారా తీసుకొనే టీకా. దీనికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో) అనుమతులు మంజూరు చేసినట్లు బీబీఐఎల్‌ ప్రకటించింది.

Incovacc Booster Dose : బూస్టర్‌ డోస్‌గా ‘ఇన్‌కోవాక్‌’.. సీడీఎస్‌సీవో అనుమతి మంజూరు

incovacc booster dose

Updated On : November 29, 2022 / 8:30 AM IST

incovacc booster dose : కరోనా మహమ్మారి నివారణకు ఇప్పటికే కొన్ని రకాల బూస్టర్ డోస్ లో వచ్చాయి. కోవిడ్ వైరస్ ను నివారించేందుకు  తాజాగా మరో బూస్టర్‌ డోసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తొలిసారి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) అభివృద్ధి చేసిన చుక్కల మందు ‘ఇన్‌కోవాక్‌’ను ఇకపై బూస్టర్‌ డోసుగానూ వినియోగించుకోవచ్చు. ఇది ముక్కు ద్వారా తీసుకొనే టీకా. దీనికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో) అనుమతులు మంజూరు చేసినట్లు బీబీఐఎల్‌ ప్రకటించింది.

18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన అత్యవసర పరిస్థితుల్లో దీనిని వినియోగించేందుకు పరిమిత స్థాయిలో అనుమతులు మంజూరైనట్లు వెల్లడించింది. ఇప్పటికే కోవాక్సిన్‌ లేదా కోవిషీల్డ్‌ను రెండు డోసులు తీసుకుని ఆరు నెలలు దాటినవారు మాత్రమే ఇన్‌కోవాక్‌ను బూస్టర్‌ డోసుగా తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది.

Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం

ప్రస్తుతం కొవిడ్‌ వ్యాక్సిన్లకు పెద్దగా డిమాండ్‌ లేనప్పటికీ భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులను అడ్డుకోవడానికి ఇన్‌కోవాక్‌ను అభివృద్ధి చేసినట్లు భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా వెల్లడించారు.