పవన్‌ కళ్యాణ్‌ స్టేట్‌ రౌడీ.. అనుచరులు ఆకు రౌడీలు: గ్రంథి శ్రీనివాస్‌

పవన్‌ కళ్యాణ్‌ స్టేట్‌ రౌడీ.. అనుచరులు ఆకు రౌడీలు: గ్రంథి శ్రీనివాస్‌

Updated On : February 27, 2021 / 9:49 PM IST

భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌-జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. భీమవరం ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించినట్లు పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్‌ కౌంటర్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌ రౌడీ అని.. అతని అనుచరులు ఆకు రౌడీలంటూ కామెంట్ చేశారు. పవన్‌ ఒక మానసిక రోగి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తనను పిచ్చికుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానన్న పవన్‌ వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్‌ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు అదేవ్యాన్‌లో మిమ్మల్ని పంపారంటూ రివర్స్‌ ఎటాక్ చేశారు. జనసేన నేతలు తలులు నరికితే నరికించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరంటూ గ్రంథి శ్రీనివాస్ అన్నారు.

మత్స్యపురి సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన పవన్‌ కళ్యాణ్‌.. గ్రంథి శ్రీనివాస్‌ను టార్గెట్ చేశారు. జనసేన దెబ్బకు భీమవరం ఎమ్మెల్యే పీఠం కదులుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను పవన్‌ కోరారు. ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి జనసేన కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తే మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.