Rahul Court Case: రాహుల్ గాంధీపై ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్ధతిలో కోర్టు విచారణ

రాహుల్ గాంధీ పై నమోదైన కేసును.. ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్రలోని భివాండి కోర్టు వెల్లడించింది.

Rahul Court Case: రాహుల్ గాంధీపై ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్ధతిలో కోర్టు విచారణ

Rahul

Updated On : February 6, 2022 / 7:08 AM IST

Rahul Court Case: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును.. ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్రలోని భివాండి కోర్టు వెల్లడించింది. 2014లో థానేలోని భివాండీలో ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ..ఆర్ఎస్ఎస్ మూలాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివారానికి చెందిన వారే మహాత్మా గాంధీని హత్య చేశారంటూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. రాహుల్ ప్రసంగానికి సంబంధించి వీడియోలను సేకరించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంతే.. వాటి ఆధారంగా రాహుల్ పై భివాండీ కోర్టులో కేసు వేశాడు. రాహుల్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కుంతే పేర్కొన్నాడు.

Also read: WHO Chief: కరోనా మూలాలపై చైనాతో చర్చిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ఆ కేసుపై ఆనాటి నుంచి రాహుల్ విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరి 29న మరోసారి విచారణ చేపట్టిన భివాండీ న్యాయస్థానం..విచారణను ఫిబ్రవరి5కి వాయిదా వేసింది. అదే సమయంలో.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలపై నెలకొన్న కేసులను అత్యవసరంగా పరిష్కరించాలంటూ సుప్రీం కోర్టు చేసిన సూచనల నేపథ్యంలో ఈ కేసును కూడా అదే పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఫిబ్రవరి 5న న్యాయస్థానం ఎదుట హాజరు కావాల్సి ఉండగా..ఇరు పక్షాల వారు హాజరు కాలేదు.

Also read: Karnataka Hijab Row: కర్ణాటకలో ముదురుతున్న బురఖా వివాదం

ఫిర్యాదు దారుడైన రాజేష్ కుంతే వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేడని.. కేసు విచారణను మరొక తేదికి వాయిదావేయాలంటూ క్లయింట్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకోగా.. తమ క్లయింట్ రాహుల్ గాంధీ సైతం గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారంటూ రాహుల్ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో ఈకేసును ఫిబ్రవరి 10కి వాయిదా వేసిన కోర్టు..ఆ నాటి నుంచి రోజువారీ పద్దతిలో ఈ కేసును విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Also read: Rajnath Singh: రాహుల్ చైనా గురించి ఏం చదివితే అదే నమ్ముతాడు: రాజ్‌నాథ్ సింగ్ ఫైర్