Karnataka Hijab Row: కర్ణాటకలో ముదురుతున్న బురఖా వివాదం

బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.

Karnataka Hijab Row: కర్ణాటకలో ముదురుతున్న బురఖా వివాదం

Hijab Row

Karnataka Hijab Row: కర్ణాటక రాష్ట్రంలో పలు కళాశాలల్లో ముస్లిం విద్యార్థినిలు బురఖా ధరించి రావడంపై ఇతర విద్యార్థి వర్గాలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. మొదటి ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ నిరసనలు ప్రస్తుతం మరో మూడు జిల్లాలకు వ్యాపించాయి. అదే సమయంలో విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించడంపై అధికార బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించి.. చదువుకు విలువ లేకుండా చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థినిలు బురఖా ధరించడంపై కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ శనివారం స్పందిస్తూ.. విద్యాసంస్థలను “తాలిబానీకరణ” చేసే కుట్రలను తాము సహించబోమని అన్నారు.

Also read: Rajnath Singh: రాహుల్ చైనా గురించి ఏం చదివితే అదే నమ్ముతాడు: రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

విద్యావ్యవస్థపై మతపరమైన విశ్వాసాలను రుద్దడం దురదృష్టకరమని..విద్యావ్యవస్థలో ఆస్కారంలేని ఇటువంటి విషయాలపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ అన్నారు. బురఖా విషయమే కాకుండా ఇతర ఏ మతపరమైన అంశాలను విద్యార్ధులపై ప్రభావం చూపకుండా పాఠశాలలకు దిశానిర్దేశం చేస్తామని నళిన్ కుమార్ అన్నారు. విద్యార్థులందరు ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫార్మ్ ధరించేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also read: Parrot Steals GoPro: “గోప్రో కెమెరా”ను దొంగిలించి ఎగిరిపోయిన చిలుక, అద్భుతమైన వీడియో రికార్డ్

ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ..బురఖా ధరించి వచ్చిన విద్యార్థులను అడ్డుకోవడంతో.. వారిని చదువుకు దూరం చేసినవారం అవుతామని, బురఖా ధరించిన వారిని అడ్డుకోవద్దంటూ ట్వీట్ చేశారు. చదువుల తల్లి సరస్వతి అందరికి జ్ఞానాన్ని ఇస్తుందని, ఎవరిని వేరుగా చూడదని రాహుల్ గాంధీ అన్నారు. అయితే బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ(కాంగ్రెస్) ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.

Also read: NEET PG 2022 Reschedule: నీట్ పీజీ 2022 వాయిదా..మే 21న ఎగ్జామ్