TRS MLAs Trap Issue : కేసీఆర్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ అధిష్టానం .. ఎదురుదాడికి కాషాయదళం రెడీ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ కుట్ర పన్నింది అని..హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా? మీరు కూలుస్తానని కుట్రలు చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? తగిన బుద్ధి చెప్పి తీరుతాను..అంటూ మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై బీజేపీపై సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈఆరోపణలపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీఎం కేసేీఆర్ కు..టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటానికి రెడీ అయ్యింది.

BJC central leaders are serious about CM KCR's allegations on Moinabad farmhouse incident..
TRS MLAs Trap Issue : హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా? మీరు కూలుస్తానని కుట్రలు చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? తగిన బుద్ధి చెప్పి తీరుతాను..అంటూ మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై బీజేపీపై సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎమ్మెల్యేలను కొంటే ఇక ఎన్నికలు ఎందుకు? ఎమ్మెల్యేలను కొని మా ప్రభుత్వాన్నే కూలుస్తామంటే మేం చూస్తూ ఊరుకోవాలా? ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాలను అస్థిరపరచటం.
CM KCR: బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్
ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం వంటి మీ హేయమన చర్యను, అరాచకాన్ని నేను చూస్తూ భరించేది లేదు అంటూ సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ ఆరోపణలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది బీజేపీ అధిష్టానం. దీంతో ప్రెస్ మీట్ పెట్టి మీర సీఎం కేసీఆర్ ఆరోపణలను తిప్పి కొట్టాడానికి రెడీ అయ్యింది. ముఖ్యంగా ప్రధాని మోడీ,అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోశ్ ల పేర్లను కేసీఆర్ ప్రస్తావించటంపై సీరియస్ అయ్యింది బీజేపీ అధిష్టానం.
దీంట్లో బాగంగానే ఈరోజు అంటే శుక్రవారం (నవంబర్ 4,2022) మధ్యాహ్నాం 12 గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ధీటుగా సమాధానం చెప్పటానికి రెడీ అయ్యారు. గట్టిగా స్పందించి టీఆర్ఎస్ అధినేతకు సమాధానం చెప్పి తీరాలని నిర్ణయించింది. కేసీఆర్ కు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం ఆదేశించింది. దీంతో తెలంగాణ బీజేపీ నేత..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్యాహ్నాం 12 గంటలకు ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు.