Patanjali Ramdev Baba: ఆ పేరును మార్చండి.. రామ్‌దేవ్‌ బాబాకు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

రామ్‌దేవ్ బాబా తన వ్యాపార సామ్రాజ్యానికి యోగా పితామహుడిగా భావించే మర్షి పతంజలి పేరును తొలగించాలని, మీ సొంత పేరుతో మీ బ్రాండ్‌ను నిర్మించుకోవాలని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సూచించారు. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు.

Patanjali Ramdev Baba: ఆ పేరును మార్చండి.. రామ్‌దేవ్‌ బాబాకు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

baba Ramdev

Updated On : November 24, 2022 / 9:37 PM IST

Patanjali Ramdev Baba: ఆధునిక యోగా పితామహుడిగా భావించే మహర్షి పతంజలి పేరును ఉపయోగించుకుని పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారని బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గురువారం ఆరోపించారు. మీ బ్రాండ్‌లో ఈ పేరును ఉపయోగించడం మానేయాలని, మీ సొంత పేరుతో మీ బ్రాండ్‌ను నిర్మించుకోండి అంటూ ఎంపీ సూచించారు. లక్నోకు తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోఉన్న కొండార్ గ్రామ పంచాయతీలోని మహర్షి పతంజలి జన్మస్థలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలుచేశారు.

Patanjali: రాందేవ్ బాబాకు షాక్.. ఆ ఐదు ఉత్పత్తులు నిలిపివేయాలంటూ ఆదేశాలు

రామ్‌దేవ్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటంలో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, పంతంజలి పేరుమీద నెయ్యి, నూనె, సబ్బు, మసాలాలు, లోదుస్తులు, ప్యాంటు వ్యాపారం చేయడం సముచితమేనా అంటూ ప్రశ్నించారు. ఈ హక్కు రామ్‌దేవ్‌కు ఎవరు ఇచ్చారని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. దేశం, ప్రపంచ ప్రజలు అయోధ్యకు వచ్చినప్పుడల్లా కొండర్‌ను తప్పక సందర్శించాలని ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు.

Baba Ramdev : బాబా రాందేవ్‌ను ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

పతంజలి పేరును వారి వ్యాపార సంస్థకు తీసివేయాలని, పేరుమార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని ఎంపీ హెచ్చరించారు.