Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోంది.

Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

Harish Rao Letter To Centre

Updated On : June 18, 2022 / 2:24 PM IST

Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోంది. తెలంగాణలో జరిగిన దాడుల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉంటే.. యూపీలో జరిగిన దాడుల వెనుక ఎవరి హస్తం ఉంది? బండి సంజయ్, డి.కె.అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.

Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్

అగ్నిపథ్ పథకాన్ని మార్చాలని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారు. బీజేపీ మాటలు తీయగా.. చేతలు చేదుగా ఉన్నాయి. అగ్నిపథ్ యువతకు అర్థం కాలేదు అనడం హాస్యాస్పదం. కేంద్ర నిర్ణయంతో దేశంలో అగ్గిరాజుకుంది. బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుంది. ఆర్మీలో కాంట్రాక్టు ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. యువకుల బాధ బీజేపీకి అర్థం కావడం లేదు’’ అని హరీష్ రావు విమర్శించారు.