Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్ Revanth Reddy criticises govt decision on agnipath

Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్

కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైనికులు రక్షణ... అనేది కాంగ్రెస్ సిద్దాంతం.

Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్

Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా ‘అగ్నిపథ్’లాంటి కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సైన్యంలో చేరికలను కూడా ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించారు.

Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

‘‘కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైనికులు రక్షణ… అనేది కాంగ్రెస్ సిద్దాంతం. అయితే కాంగ్రెస్ ముక్త భారత్ కోరుకుంటున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపైనే కాదు.. ఆ పార్టీ ఇచ్చిన నినాదంపై కూడా కక్షగట్టింది. పార్లమెంటులో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను.. చట్టం చేసిన తర్వాత పార్లమెంటుకు తీసుకొస్తున్నారు. సైన్యాన్ని అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ‘అగ్నిపథ్’లో భాగంగా సైన్యంలో చేరిన యువకులను నాలుగు సంవత్సరాల తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా బయటకు పంపించే పథకమిది.

Agnipath: సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర కోణం.. పోలీసుల అనుమానం

ఇప్పటికే దేహధారుడ్య పరీక్షలు పూర్తి చేసుకుని, పరీక్షలకు సిద్ధమవుతున్న యువత విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన చర్యలే సికింద్రాబాద్‌లో జరిగాయి. ప్రభుత్వ విధానాల వల్లే వేలాది మంది యువత నిరసన తెలిపారు. ముందుగా లాఠీఛార్జి చేయడం వల్లే అక్కడ హింస జరిగింది. సంయమనం కోల్పోయి రైల్వే ఫోర్స్ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో యువకుడు చనిపోయాడు. మరింతమంది గాయపడ్డారు. బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం అందించి పరామర్శించాల్సిన కిషన్ రెడ్డి అమిత్ షా దగ్గరికి వెళ్లారు. ట్విట్టర్ పిట్ట ట్విట్టర్‌లో ఏదో వాగితే, దానికి బదులుగా మాట్లాడుతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇద్దరూ దోషులే. పార్లమెంటు వేదికగా టీఆర్ఎస్, కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు.

covid 19: దేశంలో పెరుగుతున్న కరోనా.. 13,000 దాటిన కేసులు

కేంద్రం తక్షణమే అగ్నిపథ్ ఉపసంహరించుకోవాలి. ప్రధాని పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో కూడా బస్సులు, రైళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. బాధ్యత కలిగిన కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ల అధ్యక్షుడి నాలెడ్జ్ అంతే. కాంగ్రెస్ పిలుపునిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం దాడి చేశాయా? ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా? రాష్ట్రంలో తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం నేను వరంగల్ వెళ్తున్నా. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా. హింస పరిష్కారం కాదు. కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

×