covid 19: దేశంలో పెరుగుతున్న కరోనా.. 13,000 దాటిన కేసులు

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,83,793. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,840. దేశంలో కరోనా రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు.

covid 19: దేశంలో పెరుగుతున్న కరోనా.. 13,000 దాటిన కేసులు

Covid 19

covid 19: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,216 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో 23 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.16గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతంగా ఉంది.

Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,83,793. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,840. దేశంలో కరోనా రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,26,90,845. కరోనాతో మరణించిన 23 మందిలో కేరళ నుంచే 13 మంది ఉండటం గమనార్హం. తాజా గణాంకాలు పరిశీలిస్తే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం దాదాపు రెండు వేల లోపే ఉన్న కేసులు ఇప్పుడు పదమూడు వేలకు చేరుకున్నాయి.

Damera Rakesh: రాకేష్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి: మంత్రి ఎర్రబెల్లి

ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలోనూ కేసులు సంఖ్య పెరుగుతోంది.