Uttar Pradesh Violence: బీజేపీ ఒక్కసారిగా మేల్కొని ప్రకటన చేసింది: ఒమర్ అబ్దుల్లా
బీజేపీ తీరుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి తీరు సరికాదని బీజేపీ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Omar Abdullah
Uttar Pradesh Violence: బీజేపీ తీరుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మతానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేగాక నురూప్ శర్మతో పాటు, బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్‌ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. దీనిపై ఒమర్ అబ్దుల్లా ట్విటర్ వేదికగా స్పందించారు.
Uttar Pradesh Violence: పార్టీ నేతలు నురూప్ శర్మ, నవీన్ కుమార్‌పై బీజేపీ సస్పెన్షన్
ఏ మతానికి చెందిన ప్రముఖులనైనా, ఏ మతాన్నయినా కించపర్చుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇటువంటి తీరును తమ పార్టీ ఖండిస్తుందని బీజేపీ పేర్కొందని ఒమర్ అబ్దులా గుర్తు చేశారు. బీజేపీ ఒక్కసారిగా మేల్కొని ఇటువంటి ప్రకటన చేసిందని అన్నారు. అయితే, భారత్‌లో లక్షలాది మంది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని, బీజేపీ చేసిన ప్రకటన వల్ల వారికి ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు. భారత్‌లోని ముస్లింల గురించి కాకుండా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఆ ప్రకటన చేసినట్లు ఉందని చెప్పారు.