Rajya Sabha Polls: ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు.. నవాబ్ మాలిక్‌కు నిరాశ
రాజ్యసభ ఎన్నికలు నేడు జరుగుతోన్న విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబైలోని ఓ కోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఆయన నేడు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

Sameer Wankhede Wore Rs 70,000 Shirt Nawab Malik
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికలు నేడు జరుగుతోన్న విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబైలోని ఓ కోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఆయన నేడు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఓటు వేసేందుకు ఒక్కరోజు బెయిల్ కావాలని ఆయన కోరారు. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
Rajya Sabha Polls: మా పార్టీ నేతలను కొనేందుకు కాంగ్రెస్ బేరసారాలు: కుమారస్వామి
కాగా, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది ఫిబ్రవరి 23న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో మిగిలిన 16 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.