Top Headlines: BRSను ఓడించాలన్న కసితో ప్రజలున్నారన్న ఈటల.. విపక్షాల మాయ మాటలు నమ్మొద్దన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంపై BRS ఫోకస్ పెట్టింది. ఈనెల 25న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనుంది.

2PM Headlines
కౌంటర్ అటాక్ ..
హైదరాబాద్ అభివృద్ధి ఘనత కాంగ్రెస్‌దేనని, హామీలను BRS విస్మరించిందని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు.
ఆశీర్వదించండి ..
విపక్షాల మాయ మాటలు నమ్మొదన్న మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు.
ప్రచార పర్వం ..
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంపై BRS ఫోకస్ పెట్టింది. ఈనెల 25న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనుంది.
బదులివ్వండి ..
కర్ణాటకలో అమలు చేయని హామీలు తెలంగాణలో నెరవేరుస్తారా..? అంటూ కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు.
ఏం చేశారు..?
పేదల భూములు లాక్కోవడం తప్ప చేసిందేమీ లేదని, BRSను ఓడించాలన్న కసితో ప్రజలున్నారన్న ఈటల రాజేందర్ అన్నారు.
సేమ్ టూ సేమ్ ..
పవన్ కలసిరావడం సంతోషంగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మా ఇద్దరిదీ ఒకటే భావజాలమని పేర్కొన్నారు.
నిధులెక్కడ?
అప్పులు చేస్తున్నా ఏపీలో అభివృద్ధి లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. కేంద్రం నిధులను వైసీపీ సర్కార్ దారి మళ్లిస్తోందని ఆమె ఆరోపించారు.
ఎదురుదాడి ..
రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఏపీ మంత్రి అమర్ నాథ్ అన్నారు. చంద్రబాబు పోలవరం నిధులు కొట్టేశారని ఆరోపించారు.
రెస్క్యూఆపరేషన్ ..
టన్నెల్‌లో కార్మికులను రక్షించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి వీకే సింగ్ అన్నారు. ఆయన రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించారు.
సీబీఐ విచారణ ..
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణ స్కామ్‌పై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది.
కమలం వరాలు ..
రాజస్థాన్‌లో సంకల్ప పత్ర పేరుతో BJP మ్యానిఫెస్టో విడుదల చేసింది. రైతులు, మహిళలు, విద్యార్థులకు కమలం వరాల జల్లు కురిపించింది.
గెలుపెవరిది?
వరల్డ్ కప్ 2023లో భాగంగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.