Top Headlines: బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు రద్దు.. అసైన్డ్‌ భూములకు పట్టా హక్కు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు

Top Headlines: బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు రద్దు.. అసైన్డ్‌ భూములకు పట్టా హక్కు

అసైన్డ్‌ భూములకు పట్టా హక్కు
అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చి అన్ని హక్కులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే మళ్లీ అధోగతి తప్పదని కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు.

సీపీఎం నేతలతో హరీశ్‌రావు భేటీ
సంగారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకులతో మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. సీపీఎం పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని లెఫ్ట్ నాయకులను హరీశ్ కోరారు.

కాంగ్రెస్ అధికారమిచ్చి బాధపడుతున్నారు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చి రైతులు బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ స్కీముల పార్టీయని, కాంగ్రెస్‌ స్కామ్‌ల పార్టీ అని ఆయన అన్నారు.

ప్రజల ఆకాంక్షలు నెరవరలేదు
బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పేదల ప్రభుత్వం రావాలన్నా.. దొరల రాజ్యం కూలాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటే
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హిందూ సంఘటిత శక్తి ఏకంకావాని ఆయన పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.

రేపు రాహుల్‌.. ఎల్లుండి అమిత్‌షా బహిరంగ సభలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు. ఇక రాహుల్ గాంధీ సభలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే 6 డిక్లరేషన్స్ ప్రకటించిన కాంగ్రెస్ పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం అయింది. జనాకర్షక హామీలతో మ్యానిఫెస్టో సిద్ధం చేసింది హస్తం పార్టీ.

బాబు మరికొంతకాలం బెయిల్‌పై బయట ఉండేలా ప్రయత్నాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరికొంతకాలం బెయిల్‌పై బయట ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు. ప్రస్తుతం మెడికల్ బెయిల్ పై ఉన్న చంద్రబాబు.. మరికొంత కాలం బెయిల్ పై ఉండేందుకు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. మేనేజ్‌ చేసి హెల్త్‌ రిపోర్టును రాయించుకున్నారని సజ్జల ఆరోపించారు.

బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తుంది
భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం రాజస్థాన్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆరుగురు సభ్యులతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది.