Chicken Crowing Complaint : కోడి కూత కూస్తుందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. యజమానిపై కేసు నమోదు

మధ్యప్రదేశ్‌లోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోడి యజమానిపై సెక్షన్‌ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Chicken Crowing Complaint : కోడి కూత కూస్తుందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. యజమానిపై కేసు నమోదు

chicken crowing complaint

Updated On : November 29, 2022 / 3:58 PM IST

Chicken Crowing Complaint : మధ్యప్రదేశ్‌లోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అలోక్‌ మోడీ అనే వ్యక్తి ఇండోర్‌ పాలసియా ప్రాంతంలోని గ్రేటర్‌ కైలాష్‌ ఆస్పత్రి సమీపంలో ఉన్న సిల్వర్‌ ఎన్‌క్లేవ్స్‌లో నివాసముంటున్నాడు. అతను వృత్తి రీత్యా క్యాన్సర్‌ వైద్యుడు. రోజంతా డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంటాడు. ఉదయం వరకు నిద్రలేవడు.

అయితే, తన ఇంటి సమీపంలోని వందన విజయన్‌ అనే వ్యక్తికి చెందిన కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూత కూస్తూ మోడీ నిద్రకు భంగం కలిగించేది. ఇదే విషయాన్ని అతను విజయన్‌కు పలుమార్లు చెప్పాడు. కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చాడు. అయితే అది సాధ్యం కాలేదు. కోడీ మళ్లీ అలానే కూయడంతో విసిగుచెందిన మోడీ.. పాలసియా పోలీసులను ఆశ్రయించాడు. కోడి కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు.

German Rooster: కోడి కూస్తోందని కేసుపెట్టిన వృద్ధ దంపతులు.. వారి బాధ వర్ణణాతీతం ..

రోజంతా ఆసుపత్రిలో బిజీగా ఉండి.. అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటున్నానని.. అయితే, తన ఇంటి సమీపంలోని వందన విజయన్‌కు చెందిన కోడి రోజూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కోడి యజమాని వందన విజయన్‌పై సెక్షన్‌ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.