German Rooster: కోడి కూస్తోందని కేసుపెట్టిన వృద్ధ దంపతులు.. వారి బాధ వర్ణణాతీతం ..

పల్లెల్లో ఉదయాన్నే కోడి పుంజు కూత వినిపిస్తే తెల్లారినట్లే.. ఇప్పటికీ చాలా మంది దాని కూతతోనే నిద్ర నుంచి లేస్తుంటారు. అలాంటిది కోడి పుంజు కూస్తోందని ఓ వృద్ధ జంట ఏకంగా కోర్టుకెక్కారు.

German Rooster: కోడి కూస్తోందని కేసుపెట్టిన వృద్ధ దంపతులు.. వారి బాధ వర్ణణాతీతం ..

Old couple

German Rooster: పల్లెల్లో ఉదయాన్నే కోడి పుంజు కూత వినిపిస్తే తెల్లారినట్లే.. ఇప్పటికీ చాలా మంది దాని కూతతోనే నిద్ర నుంచి లేస్తుంటారు. అలాంటిది కోడి పుంజు కూస్తోందని ఓ వృద్ధ జంట ఏకంగా కోర్టుకెక్కారు. కోడన్నాక కూయడం మామూలేగా.. అంతమాత్రానికే కోర్టుకెళ్లాలా అని మీకు అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆ కోడి పుంజు రోజుకు ఎన్నిసార్లు కూస్తుందో తెలిస్తే ఆ వృద్ధ దంపతులు ఎంత బాధను అనుభవించారో తెలుస్తోంది. ఆ కోడిపుంజు దెబ్బకు చుట్టుపక్కల వారు ఇళ్లు ఖాళీ చేసి పోయారట. ఈ విచిత్ర ఘటన జర్మనీలో చోటు చేసుకుంది.

Viral Video: మన మధ్య గొడవొద్దు..! నీకు కొంచెం.. నాకు కొంచెం.. పిల్లుల ఐక్యత అదుర్స్..! వీడియో వైరల్‌

జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా కోడి పుంజుపై కేసు పెట్టారు. వీరు నివసించే ప్రాంతంలో కోడి పుంజు వీరిని తెగ ఇబ్బంది పెట్టేది. ఉదయాన్నే కోడి పుంజు కూత వినిపిస్తోంది. అయితే ఇక్కడ కోడి పుంజు మాత్రం రోజుకు ఏకంగా 200 సార్లు కూస్తోందంట. అదికూడా 80 డెసిబెల్స్ రేంజులో. ఉదయం 8గంటలకు మొదలయ్యే దాని కూత.. సాయంత్రం ఇతర కోళ్లతో గూటికిపోయే వరకు నాన్ స్టాప్ గా కొనసాగుతుందట. దీంతో ఈ వృద్ధ జంట బాధ వర్ణణాతీతంగా మారింది. ప్రశాంతంగా నిద్రపోలేక పోతున్నామని వృద్ధ జంట కోర్టుకు మొరపెట్టుకుంది.

Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది

ఈ కోడి పుంజు కూతతో ఇప్పటికే ఆ ప్రాంతంలోని చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి పోయారంటే అది స్థానికులను ఎంతగా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి 9గంటల తరువాత కొంచెం ప్రశాంతంగా ఉంటుందని, మళ్లీ ఉదయం అవుతుందంటే ఈ కోడి పుంజు కూతతో చెవులు మూసుకోవాల్సి వస్తుందని ఆ వృద్ధ జంట వాపోయింది. ఎన్నిసార్లు దాన్ని తరిమేసినా ఫలితం లేదని, చేసేదేమీలేక ఇళ్లకు కిటికీలు, తలుపులు మూసుకుంటున్నామని, అయినా దాని కూతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. అయితే ఈ కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. జడ్జి ఇచ్చే తీర్పుతోనైనా తమ బాధ తొలగిపోతుందని ఆ వృద్ధ జంట ఆశతో ఉంది.