Chiranjeevi: టైగర్ కోసం వస్తున్న మెగాస్టార్!
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా ఆయన లైన్‌లో....

Chiranjeevi To Grace Opening Ceremony Of Tiger Nageswara Rao Movie
Chiranjeevi: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా ఆయన లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రావణాసుర, ధమాకా వంటి సినిమాలను తెరకెక్కిస్తున్న రవితేజ, తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాను రవితేజ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు కోసం కొత్త బ్యూటీ..!
ఈ సినిమాకు సంబంధించి ముహూర్తం సమయాన్ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఉగాది పర్వదిన్నాని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో ముహూర్తపు షాట్‌తో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, మాస్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఆయన ఈ సినిమాలో కనిపిస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేశారు.
Tiger Nageswara Rao: టైగర్ కోసం రేణుదేశాయ్.. మాస్ రాజాకి సోదరి?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో రవితేజ కేమియో పాత్రలో కనిపిస్తారనే వార్త గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు రవితేజ్ సినిమా ఓపెనింగ్‌కు చిరు గెస్ట్‌గా వస్తుండటంతో ఈ వార్త నిజమే అంటున్నారు సినీ ప్రేమికులు. ఇక దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.