Chiranjeevi – Jr. NTR : జూ.ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన మెగాస్టార్.. కరోనా సోకిన తారక్‌ను ఫోన్‌లో పరామర్శించిన చిరంజీవి..
ఇటీవల కరోనా బారినపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో పరామర్శించారు.. తారక్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన చిరు, తను క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ ట్వీట్ చేశారు..

Chiranjeevi Tweet About Jr Ntr Health Condition
Chiranjeevi – Jr. NTR : ఇటీవల కరోనా బారినపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో పరామర్శించారు.. తారక్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన చిరు, తను క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ ట్వీట్ చేశారు..
Jr. NTR : జూ. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల సర్వమత ప్రార్థనలు..
‘కాసేపటి క్రితం తారక్‌తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అతను, అతని ఫ్యామిలీ మెంబర్స్ క్షేమంగా ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని చాలా సంతోషించాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తారక్..’ అంటూ చిరు ట్వీట్ చేశారు.
మెగాస్టార్ తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తియ్యడమే కాకుండా, అభిమానులు ఆందోళన చెందకుండా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినందుకుగాను.. చిరు ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ మంచి మనసుకు కృతజ్ఞతలు చెబుతున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్..
కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.
God bless @tarak9999— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2021