Team India : విశ్వ‌విజేత‌ల‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్రశంసలు.. యువ‌త‌రానికి..

భార‌త మ‌హిళా క్రికెట్ జట్టు (Team India) గురువారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిశారు.

Team India : విశ్వ‌విజేత‌ల‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ప్రశంసలు.. యువ‌త‌రానికి..

Indian Women Cricket team meet President Droupadi Murmu at Rashtrapati Bhavan

Updated On : November 6, 2025 / 4:54 PM IST

Team India : తొలిసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించిన భార‌త మ‌హిళా క్రికెట్ జట్టు గురువారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిశారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తికి భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్లు సంత‌కం చేసిన జెర్సీని అందించారు. అంతేకాదండోయ్‌.. ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు.

ఈ సంద‌ర్భంగా భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును (Team India) రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అభినందించారు. ప్రపంచకప్ సాధించి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ వారిని ప్ర‌శంసించారు. కాగా.. భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు బుధ‌వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని క‌లిసిన సంగ‌తి తెలిసిందే.

Pratika Rawal : ప్ర‌తీకా రావ‌ల్ మెడ‌లో విన్నింగ్ మెడ‌ల్ ఎక్క‌డింది? ఐసీసీ ఇవ్వ‌లేదుగా.. అస‌లు విష‌యం ఇదేనా ?

ఆదివారం (న‌వంబ‌ర్ 2) నవీ ముంబై వేదిక‌గా భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో 52 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాను భార‌త్ ఓడించింది. తద్వారా తొలిసారి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ ముద్దాడింది.