Ram Gopal Varma: ఆర్జీవీపై ముంబై కోర్టులో ఫిర్యాదు

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముపై సినీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశారంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కారు. తాను బీజేపీ కార్య‌క‌ర్త‌న‌ని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో సుభాష్ రాజోరా అనే వ్య‌క్తి ఈ కేసు వేశారు.

Ram Gopal Varma: ఆర్జీవీపై ముంబై కోర్టులో ఫిర్యాదు

Rgv

Updated On : July 16, 2022 / 7:39 PM IST

Ram Gopal Varma: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముపై సినీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశారంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కారు. తాను బీజేపీ కార్య‌క‌ర్త‌న‌ని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో సుభాష్ రాజోరా అనే వ్య‌క్తి ఈ కేసు వేశారు. సెక్ష‌న్లు 499, 500 (ప‌రువు న‌ష్టం), 504 (ఉద్దేశ పూర్వ‌కంగా అవ‌మానించ‌డం), 506 (నేర‌పూరిత బెదిరింపున‌కు శిక్ష‌) కింద సుభాష్ రాజోరా ఈ కేసు వేసిన‌ట్లు ఆయ‌న న్యాయ‌వాది డీవీ స‌రోజ్ ఇవాళ మీడియాకు తెలిపారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

సుభాష్ ఫిర్యాదును అక్టోబ‌రు 11న ప‌రిశీలిస్తామ‌ని జ‌డ్జి తెలిపారు. రామ్ గోపాల్ వ‌ర్మ ట్విటర్ ఖాతాలో అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశార‌ని సుభాష్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. వ‌ర్మ వ్యాఖ్య‌లు ఎస్సీ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. కాగా, ఎన్డీఏ త‌మ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా గిరిజ‌న నాయ‌కురాలు ద్రౌప‌ది ముర్మును పోటీకి దించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రామ్‌గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.