కరోనావైరస్ నుంచి మనం తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలివే!

భారతదేశంలో అన్ లాక్-3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరింత సడలింపు ఇచ్చింది. జిమ్‌లు, యోగా సెంటర్లు, వారంతపు మార్కెట్లు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇండియాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
అన్‌లాక్ 3లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా కనిపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు అందరూ తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్క్ లు ధరించాలని సూచిస్తోంది. కరోనా వ్యాప్తి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. ఈ కింది 5 జాగ్రత్తలను తప్నక పాటించాలి.. అవేంటో ఓసారి చూద్దాం..
సామాజిక దూరాన్ని పాటించండి :
ప్రతిఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి.. అప్పుడే కరోనాను కట్టడ చేయడం సాధ్యపడుతుంది. మీ స్నేహితులు, కుటుంబం లేదా అవసరమైన వాటి కోసం బయటకు అడుగు పెట్టాల్సి వస్తుంది.. ఇలాంటి సమయాల్లో బయట వారితో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఇతరుల నుంచి సామాజిక దూరాన్ని పాటించాలి. తగినంత దూరం ఉండేలా చూసుకోండి.
మాస్క్ ధరించండి :
మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నట్టయితే.. మీ ముక్కు, నోటిని మాస్క్‌తో కవర్ చేయండి. మీ సామాజిక సమావేశాలను తగ్గించండి. వర్చువల్ మీటింగ్ ద్వారా ఎక్కువగా మీట్ అయ్యేందుకు ప్రయత్నించండి. కాస్తా కుదిరితే.. ఒకేసారి ఎక్కువ మందిని కలవడానికి ప్రయత్నించండి. లేదంటే పరిమితం చేయండి. ఈ సమయంలో మీటింగ్ వంటి కార్యకలాపాలు ఎంతమాత్రం మంచిది కాదు.. మీకు ఇష్టమైన వారితో సాధ్యమైనంతవరకు ఆన్‌లైన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించండి..
అన్ని సమయాల్లో శానిటైజర్‌ను తీసుకెళ్లండి :
మీ బ్యాగులో హ్యాండ్ శానిటైజర్ ఎల్లప్పుడూ ఉంచుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. 20 సెకన్ల ఏదైనా మ్యూజిక్ వింటూ మీ చేతులు కడుక్కోవడం చేస్తుండాలి..
శారీరక సంబంధాన్ని నివారించండి :
చేతులతో ముట్టుకోవడం, స్నేహితులను కౌగిలించుకోవడం లేదా హాయ్-5 చేయడం వంటి అలవాట్లను మానుకోండి. శారీరక సంబంధం లేకుండా మీ కుటుంబం, స్నేహితులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించండి. వారిని అభినందించండి. అందరితో ప్రేమగా ఉండండి.. కరోనావైరస్‌తో పోరాడుతున్న వారిని దూరం పెట్టొద్దు.. ఇలాంటి వైరస్ లతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి..