కరోనా అంటే భయం లేదా ? గుంపులు గుంపులుగా జనాలు

భారతదేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విధించిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో ప్రజలు భారీగా రోడ్ల మీదకు వస్తున్నారు. కానీ కేంద్రం, రాష్ట్రాలు విధించిన నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూరం అస్సలు పాటించకపోతుండడం తీవ్ర ఆందోళన రేకేత్తిస్తోంది. ఒక్కరిలో కూడా భయం, బాధ్యత అనేది కనిపించడం లేదు.
పరాయి దేశాల్లో జరుగుతున్న విధ్వంసాన్ని చూసినా కూడా ఏ మాత్రం చలించడం లేదు. ఇలాగే కొనసాగితే..రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నా..డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది. బాధ్యతను విస్మరిస్తున్న వారిలో చదువుకున్న వారు కూడా ఉండడం దురదృష్టకరం. ఈ నెల ప్రారంభం నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు రికార్డవుతున్నాయి.
మే 31వ తేదీ నుంచి సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. మెరైన్ డ్రైవ్ వద్ద జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మాస్క్ ధరించారు కానీ..భౌతిక దూరం పాటించలేదు. ఇందుక సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇన్ స్ట్రా గ్రామ్ యూజర్ నిహారిక కులకర్ణి ఈ ఫొటోను షేర్ చేశారు. అన్ లాకింగ్ మొదటి దశలో భాగంగా జూన్ 03వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా…బహిరంగ కార్యకలాపాలకు అనుమతినించారని, జూన్ 06వ తేదీ మెరెన్ డ్రైవ్ లో భారీగా జనాలు గుమికూడారంటూ వ్యాఖ్యానించారు.