Deepthi Sunaina-Shanmukh: ఒకే బెడ్‌పై దీప్తీ, షణ్ముఖ్.. ఫొటో వైరల్!

సోషల్‌ మీడియా పుణ్యమా అని పాపులర్ అయిన పోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో దీప్తి సునయన- షణ్ముఖ్‌ జశ్వంత్‌ జంట ప్రత్యేకం. ఈ జంటకున్న క్రేజ్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

Deepthi Sunaina-Shanmukh: ఒకే బెడ్‌పై దీప్తీ, షణ్ముఖ్.. ఫొటో వైరల్!

Deepthi Sunaina Shanmukh

Updated On : May 3, 2021 / 4:50 PM IST

Deepthi Sunaina-Shanmukh: సోషల్‌ మీడియా పుణ్యమా అని పాపులర్ అయిన పోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో దీప్తి సునయన- షణ్ముఖ్‌ జశ్వంత్‌ జంట ప్రత్యేకం. ఈ జంటకున్న క్రేజ్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టిక్ టాక్ నుండి యూట్యూబ్ వరకు ఈ ఆన్‌ స్ర్కీన్‌ పెయిర్‌ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి మధ్యలో ఏదో ఉందంటూ పుకార్లు రాగా.. పెళ్లి కూడా చేసుకుంటారని కథలొచ్చాయి. కానీ, ఈలోగా దీప్తి బిగ్ బాస్ తో పాపులర్ అయితే.. షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి మరికాస్త పాలులర్ అయ్యాడు.

ఈ ఇద్దరూ విడిపోయారని అనుకుంటుండగానే చాలా రోజుల తర్వాత దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ మళ్లీ కలిశారు. మధ్యలో వచ్చిన మనస్పర్థలను పక్కన పెట్టేసి ఒక్కటైపోయారని అనుకున్నారు. అప్పటి నుంచి తరచూ కలిసి తిరుగుతూ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. అలాగే, వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే షణ్ముఖ్ ఎందరో అమ్మాయిలను ట్రాప్ చేశాడని.. ఇంటర్ చదివే అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని.. పుంఖానుగా కథనాలు రావడంతో షణ్ముఖ్ స్త్రీ లోలుడుగా బట్టబయలైంది.

Deepthi Sunaina Shanmukh

Deepthi Sunaina Shanmukh

కాగా, ఇప్పుడు ఈ జంటకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఒకే బెడ్ పై షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన నవ్వుతూ ఉండగా కెమెరా క్లిక్ మనిపించింది. ఈ ఫోటోను షేర్ చేసింది ఎవరో కాదు. స్వయంగా దీప్తీ సునయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పర్సనల్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షణ్ముఖ్‌తో కలిసి ఒకే బెడ్‌పై కనిపించింది. మరి ఈ ఫోటో వారిద్దరూ కలిసి ఏదైన వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో తీసిందా.. లేక ఏదైనా పార్టీనా అన్నది రివీల్‌ కాలేదు. అసలు ఈ ఫోటో దేనికి సంకేతమో దీప్తి చెప్పనేలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.