Republic Day: మరోసారి కేరళ శకటాన్ని తిరస్కరించిన రక్షణశాఖ
కేరళ రాష్ట్రం నుంచి.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే శకటాన్ని రక్షణశాఖ తిరస్కరించింది. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు మరియు జటాయు పార్క్ స్మారక చిహ్నాన్ని నేపధ్యంగా పంపింది

Keral
Republic Day: కేరళ రాష్ట్రం నుంచి.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే శకటాన్ని రక్షణశాఖ తిరస్కరించింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి రాష్ట్రం నుంచి పలు ప్రత్యేకతలతో కూడిన శకటాలను ప్రదర్శిస్తారు. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన సాంఘికసంక్షేమ మరియు అభివృద్ధి పనులకు సంబంధించి శకటాలను రూపొందించి.. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో పరేడ్ నిర్వహిస్తారు. శకటాలను నేపధ్యాన్ని వివరిస్తూ ముందుగా రక్షణశాఖ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. ఈక్రమంలో కేరళ రాష్ట్రం నుంచి గత రెండు సంవత్సరాలుగా(2019, 2020) పంపిన నేపధ్యాలను రక్షణశాఖ తిరస్కరించగా.. ఈ ఏడు కూడా కేరళ శకటాల నేపధ్యాన్ని తిరస్కరించారు.
Also Read: Hero : మహేష్ మేనల్లుడి కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి
ఈ ఏడాదికి గానూ సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు మరియు జటాయు పార్క్ స్మారక చిహ్నాన్ని కేరళ ప్రభుత్వం నేపధ్యంగా పంపగా వాటిని తిరస్కరించిన రక్షణశాఖ.. జగద్గురు ఆదిశంకర చార్యుని నేపధ్యాన్ని పంపాలని పట్టుబట్టింది. అయితే ఆ నేపధ్యాన్ని సైతం అధికారులు తిరస్కరించారు. ఈ వ్యవహారంపై కేరళ విద్యాశాఖ మంత్రి వీ.శివంకుట్టి స్పందిస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తమపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. శ్రీ నారాయణ గురు నేపధ్యాన్ని ఎంచుకునేందుకు కేరళ రాష్ట్ర బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందని అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చివరి నిముషంలో ఎందుకు తిరస్కరించారో అర్ధం కావడంలేదని విమర్శించారు.
Also Read: Bomb Found : ఢిల్లీలో బాంబు కలకలం..నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్