Delhi High Court : కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు

యోగా గురువు రామ్ దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు అంటూ చీవాట్లు పెట్టింది.అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు అంటూ చీవాట్లు పెట్టింది.

Delhi High Court : కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు

Delhi High Court slams Baba Ramdev

Updated On : August 18, 2022 / 3:58 PM IST

Delhi High Court slams Baba Ramdev : యోగా గురువు రామ్ దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు అంటూ చీవాట్లు పెట్టింది.అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు బుధవారం (17,2022) అంటూ చీవాట్లు పెట్టింది. కోవిడ్‌-19 బూస్టర్‌ డోస్‌ సామర్థ్యం..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ అనుప్ జె. భంభానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలతో ఆయుర్వేదానికి ఉన్న మంచి పేరును పాడుచేయవద్దని సూచించింది.

బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్‌ కోవిడ్‌పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్‌ బాబాకు చురకలు వేసింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది..ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయని ఈ విషయాన్ని గ్రహించకపోతే ఎలా? అంటూ చీవాట్లు పెట్టింది. బాబా రామ్‌దేవ్‌ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని..మీరు ఏది చెప్పినా నమ్మే ‍అనుచరులను కలిగి ఉండటం మంచిదే..కానీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అంటూ సూచించారు జస్టిస్‌ అనుప్‌ జైరాం భంభాని.

మరోవైపు.. పతాంజలి కరోనిల్‌ను సవాల్‌ చేశారు డాక్టర్స్‌ అసోసియేషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అఖిల్‌ సిబాల్‌. ఎలాంటి ట్రయల్స్‌, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్‌ కోవిడ్‌-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్‌దేవ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్‌పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది.