తన పేరుతో అమ్మాయిలకు వల.. పోలీసులను ఆశ్రయించిన ‘RX 100’ దర్శకుడు..

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మోసాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. వివిధ రూపాల్లో అమయాకులను మోసం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ కేటుగాడు ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల వివరాలు సేకరించి వారితో వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ.. తాను ‘ఆర్.ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి అని చెప్పి పరిచయం పెంచుకున్నాడు.
త్వరలో తాను హీరో విజయ్ దేవరకొండ, విశాల్‌లతో తీయబోయే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. కొందరి నుండి న్యూడ్ పిక్స్ కూడా సేకరించాడు. తర్వాత వారిని వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం డైరెక్టర్ అజయ్ భూపతి వరకు వెళ్లింది. తన పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు దర్శకుడు అజయ్ భూపతి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.