Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేశాను : క్రిష్
ఈవెంట్లో సినిమా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. 'కొండ పొలం' సినిమా విషయంలో నేను మొదటిగా కృతజ్ఞతలు చెప్పాల్సింది పవన్ కల్యాణ్ గారికి. ఆయనతో 100 కోట్ల బడ్జెట్ తో 'హరి హర వీరమల్లు'

Kondapolam
Pawan Kalyan : ఎన్నో మంచి సినిమాలని తెరకెక్కించిన డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 100 కోట్ల భారీ బడ్జెట్ తో ‘హరి హర వీరమల్లు’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో ‘కొండపొలం’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల అవ్వనుంది. ఈ నేపథ్యంలో ‘కొండపొలం’ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి కర్నూల్ లో నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సినిమా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ‘కొండ పొలం’ సినిమా విషయంలో నేను మొదటిగా కృతజ్ఞతలు చెప్పాల్సింది పవన్ కల్యాణ్ గారికి. ఆయనతో 100 కోట్ల బడ్జెట్ తో ‘హరి హర వీరమల్లు’ సినిమా తీస్తున్న టైంలో ఆర్థికపరమైన కారణాలతో, కరోనా కారణంతో సినిమా కొన్ని రోజులు ఆగింది. ఈ సమయంలో వెళ్లి ఒక సినిమా చేసుకుని వస్తానని పవన్ గారితో చెప్పాను. ఆయనకి ఈ ‘కొండ పొలం’ అనే పుస్తకం తెలుసు కాబట్టి నేను దానిని సినిమా తీస్తున్నాను అని చెప్పగానే ఒప్పుకున్నారు. అప్పటికి ఈ సినిమా హీరో వైష్ణవ తేజ్ అని కూడా పవన్ గారికి తెలీదు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద సినిమా ఆగిపోయింది అని కంగారు పడకుండా ఈ లోపు నీ టీమ్ కి ఈ సినిమా చేసుకోవడం చాలా అవసరం వెళ్లి సినిమా చేసుకుని రా అని చెప్పారు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
Nine Pelladathaa : ‘నిన్నే పెళ్లాడతా’.. 25 ఏళ్ల ప్రేమ కావ్యం.. స్పెషల్ సెలబ్రేషన్స్..
‘హరి హర వీరమల్లు’ షూటింగు సమయంలో లాక్ డౌన్ వచ్చినప్పుడు ‘కొండ పొలం’ సినిమా అడవుల్లోకి వచ్చి మరీ షూట్ చేసాము. కళ్యాణ్ గారు ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ ఐయ్యేది కాదు. పవన్ కల్యాణ్ గారు అనుమతించకపోయినా, ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఎ.ఎమ్.రత్నం గారు అంగీకరించకపోయినా, దర్శకులు సుకుమార్ గారు – ఇంద్రగంటి గారు ఈ నవలను నాకు పరిచయం చేయకపోయినా, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ పుస్తకం రాయకపోయినా ఈ సినిమా వచ్చేది కాదు. వీరందరికీ నా హార్దిక కృతజ్ఞతలు అని తెలిపారు. వైష్ణవ్ తేజ్ కి ఇది రెండో సినిమానే కానీ ఎంతో గొప్పగా నటించాడు. అతనిది చాలా గొప్ప వ్యక్తిత్వం. వైష్ణవ్ గొప్ప నటుడిగా 100 సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అంటూ క్రిష్ వ్యాఖ్యానించారు.