Nine Pelladathaa : ‘నిన్నే పెళ్లాడతా’.. 25 ఏళ్ల ప్రేమ కావ్యం.. స్పెషల్ సెలబ్రేషన్స్..
"నిన్నే పెళ్లాడతా"... ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. 25 ఏళ్ల క్రితం ప్రేమికులకు బాగా నచ్చిన సినిమా. ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో ప్రేమ కథని ఇమడ్చి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా

Ninne Pelladatha
Nine Pelladathaa : “నిన్నే పెళ్లాడతా”… ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. 25 ఏళ్ల క్రితం ప్రేమికులకు బాగా నచ్చిన సినిమా. ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో ప్రేమ కథని ఇమడ్చి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. నాగార్జున, టబుల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అవ్వడంతో ఈ సినిమాకి ఇంకా ప్లస్ అయింది. సినిమాలో ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్, ప్రతి పాట అందరికి కనెక్ట్ అయి ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఇలాంటి ఎవర్ గ్రీన్ సినిమా రిలీజ్ అయి రేపటికి పాతికేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ దీనిపై స్పెషల్ ప్రోగ్రాం కూడా చేయనుంది.
ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. శ్రీను, పండు క్యారెక్టర్స్ లో నాగార్జున, టబు జీవించారు. ఈ సినిమా తర్వాతే చాలా మంది ప్రేమికులు వాళ్ళ ప్రియురాళ్లని పండు అని పిలవడం మొదలు పెట్టారంటే ఈ సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ కుటుంబాలు, వాళ్ళ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఉమ్మడి కుటుంబాలని గుర్తు చేస్తాయి. దర్శకుడు కృష్ణ వంశి ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని ఎంతో అందంగా చూపించారు. ఈ సినిమా వచ్చిన తర్వాత అప్పటి యువకులు ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ, యువతులు గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ పాడుకున్నారు. ఇలాంటి అందమైన ప్రేమ కావ్యాన్ని నాగార్జుననే స్వయంగా నిర్మించారు.
Bheemla Nayak : రానా, పవన్ కళ్యాణ్ మధ్యలో మలయాళీ భామ
ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు అవుతున్న సందర్భంలో ఓ ప్రముఖ ఛానెల్ “నిన్నే పెళ్లాడతా”.. సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ అఫ్ ఎమోషనల్ సాగా అంటూ స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ సినిమాకి మాస్ మహారాజ్ రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేసిన రవితేజ ఈ సినిమా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ వంశి డైరెక్షన్ లోనే ‘సింధూరం’ సినిమాతో మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇచ్చాడు.