Bheemla Nayak : రానా, పవన్ కళ్యాణ్ మధ్యలో మలయాళీ భామ

పవర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్’కు ఇది

Bheemla Nayak : రానా, పవన్ కళ్యాణ్ మధ్యలో మలయాళీ భామ

Samyuktha

Bheemla Nayak :  పవర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్’కు ఇది అనువాద చిత్రం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్థానం ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన రానా టీజర్ లో నిత్యామీనన్ కూడా కనపడింది. అయితే ఇప్పుడు రానాకి జోడిగా ఓ మలయాళ హీరోయిన్ ని తీసుకొచ్చారు.

Prabhas : చేసింది ఒకే సినిమా.. కానీ ఏకంగా ప్రభాస్ తోనే ఛాన్స్..

‘భీమ్లానాయక్’లో రానా ద‌గ్గుబాటి స‌ర‌స‌న మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ నటించబోతుంది. సంయుక్తా మీన‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లోనే నటించింది. ఇప్పుడు ‘భీమ్లానాయక్’తో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ‘భీమ్లా నాయ‌క్‌’లో సంయుక్త న‌టించ‌బోతున్న విష‌యాన్ని ఆమెనే అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసింది. ‘‘ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చిత్రంలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌నుండ‌టం చాలా సంతోషంగా ఉంది. లీడ‌ర్‌, ప‌వ‌ర్‌స్టార్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. రానా ద‌గ్గుబాటిగారికి జోడీగా క‌నిపించ‌బోతున్నాను. ఇంత కంటే తెలుగులో బ్యూటీఫుల్ ఎంట్రీ ఉండ‌బోద‌ని అనుకుంటున్నాను’’ అని సంయుక్త ట్వీట్ చేసింది.

ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతి పోటీకి రావడంతో ఈ సినిమా విడుదల తేదీ మారొచ్చు అనే అభిప్రాయాలు వస్తున్నాయి.