Protein Diet : ప్రొటీన్ ఆహారం ఎక్కవగా తీసుకుంటున్నారా!….శరీరంలో జరిగే మార్పులు ఇవే?…

అధిక ప్రోటీన్ ఆహారం వల్ల శ్వాసలో దుర్వాసనగా వస్తుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల శ్వాస కుళ్ళిన పండ్ల వాసనతో నిండివుంటుంది. కీటోసిస్ ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుంది.

Protein Diet : ప్రొటీన్ ఆహారం ఎక్కవగా తీసుకుంటున్నారా!….శరీరంలో జరిగే మార్పులు ఇవే?…

Protein Foods (5)

Updated On : March 14, 2022 / 12:02 PM IST

Protein Diet : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ చాలా అవసరం. ఒక కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ రోజువారిగా అవసరమౌతుంది. ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉండాలనుకునేవారికి ప్రొటీన్ చాలా అవసరం. బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. కణాలను రిపేర్ చేయడానికి ఉపకరిస్తుంది. ఆహారంలో ఎక్కువ ప్రోటీన్‌ను కలిగిన ఆహారాలను తినేందుకు ఆసక్తి చూపించరు. అలాంటి వారిలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రొటీన్ ను శరీరానికి అవసరమైన మేరకే అందించాలి. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం అనారోగ్యకరమైనది. అధికమోతాదులో ప్రోటీన్ తీసుకుంటే శరీరంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి.

తీవ్రమైన దాహం; అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి నీరు ఎక్కవగా తాగాల్సి ఉంటుంది. తీసుకునే ప్రొటీన్‌లను బట్టి తగినంత మొత్తంలో నీరు త్రాగకపోతే దాహం వేస్తుంది. రక్తంలో అధిక నత్రజని ఉండటం వల్ల ఇది జరుగుతుంది. ప్రోటీన్ యొక్క భాగాలలో నత్రజని ఒకటి. ప్రొటీన్ అధికంగా తీసుకోవడం వలన మూత్రపిండాలు వ్యర్ధాలను బయటకు పంపేందుకు ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. దీనివల్ల నిర్జలీకరణానికి గురవ్వాల్సి వస్తుంది.

నిర్జలీకరణం దుష్ప్రభావాల వల్ల శరీర బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. తక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం , శరీరానికి శక్తి కోసం తగిన పిండి పదార్థాలు లభించనప్పుడు అది కెటోసిస్ ప్రక్రియకు దారితీస్తుంది. శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరం బలహీనమై తలనొప్పికి దారితీస్తుంది.

అధిక ప్రోటీన్ ఆహారం వల్ల శ్వాసలో దుర్వాసనగా వస్తుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల శ్వాస కుళ్ళిన పండ్ల వాసనతో నిండివుంటుంది. కీటోసిస్ ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుంది. కీటోసిస్ ప్రక్రియ ప్రారంభం శ్వాసలో అసిటోన్ ఏర్పడటానికి దారితీస్తుంది. అంతేకాకుండా, ప్రోటీన్‌లో ఉండే రెండు అమైనో ఆమ్లాలు దుర్వాసనకు కారణమవుతాయి. నీళ్లు తాగినా, పుదీనా నమిలినా ఈ వాసన రాదు.

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలవల్ల మలబద్ధకం సమస్య ఉత్పన్నం అవుతుంది. పేగుల్లో మలం కదలికల్లో తేడాలు వస్తాయి. తగినంత కార్బోహైడ్రేట్లను తీసుకోకపోతే, ప్రోటీన్ మాత్రమే తీసుకుంటే రోజంతా మలబద్ధకంతో బాధపడాల్సి వస్తుంది.. శక్తివంతంగా ఉండటానికి, క్రమం తప్పకుండా మలం విసర్జించడానికి కొంత మొత్తంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవడం చాలా అవసరం.

అధిక ప్రొటీన్ తీసుకోవడం వల్ల కొవ్వులు పెరిగి బరువు కూడా పెరుగుతారు. రెడ్ మీట్, ఫ్రైడ్ ఫుడ్స్ ,ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ వంటి మూలాల నుండి ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే అది బరువు తగ్గడం కంటే బరువు పెరగడానికి దారితీయవచ్చు.. ఎక్కువ ప్రోటీన్ ఆహారాలు బరువు తగ్గించకపోగా పెంచుతాయి. కాబట్టి ప్రొటీన్ ఆహారాలను తగిన మోతాదులోనే తీసుకోవాలి.