Anusha Shetty : నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా?? ఎన్ని అవార్డులు సాధించిందో తెలుసా??

నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని తెగవెతికేస్తున్నారు నెటిజన్లు. అనూష శెట్టి బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్. హైదరాబాద్, బెంగుళూరులో పలు లగ్జరీ ఇళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది..............

Anusha Shetty : నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా?? ఎన్ని అవార్డులు సాధించిందో తెలుసా??

Do you know about nagashourya wife Anusha Shetty

Updated On : November 11, 2022 / 7:26 AM IST

Anusha Shetty :  టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య త్వరలో ఓ ఇంటివాడు అవ్వబోతున్నాడు. ఇటీవలే నాగశౌర్య అన్నయ్య కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకోగా ఇప్పుడు నాగశౌర్య పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా ప్రకటించారు నాగశౌర్య కుటుంబ సభ్యులు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని నాగశౌర్య నవంబర్ 20న బెంగుళూరులో పెళ్లి చేసుకోబోతున్నాడు.

దీంతో నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని తెగవెతికేస్తున్నారు నెటిజన్లు. అనూష శెట్టి బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్. హైదరాబాద్, బెంగుళూరులో పలు లగ్జరీ ఇళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది. అనూష శెట్టి డిజైన్స్ అని తానే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి వర్క్ చేస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ ద్వారా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇళ్ళకి ఇంటీరియర్ డిజైన్ చేసింది.

Galatta Geetu : పాజిటివ్ గా ప్రమోట్ చేయమని 25 వేలు ఇచ్చా.. బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక సంచలన విషయాలు చెప్పిన గీతూ..

తన రంగంలో కష్టపడి పైకి ఎదిగి పలు అవార్డులని కూడా సాధించింది. 2019లో డిజైనర్ అఫ్ ది ఇయర్, 2020లో అండర్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో చోటు, 2020లో మోస్ట్ ఇన్నోవేటివ్ లగ్జరీ డిజైనర్, 2021లో ఇండియా టాప్ 10 డిజైనర్స్ లో చోటు దక్కించుకుంది. ఇలా పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది అనూష శెట్టి. పలు మ్యాగజైన్స్ లో కూడా తన గురించి స్పెషల్ ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి.