Galatta Geetu : పాజిటివ్ గా ప్రమోట్ చేయమని 25 వేలు ఇచ్చా.. బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక సంచలన విషయాలు చెప్పిన గీతూ..

ఈ వీడియోలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ గురించి, తన గురించి, తన ఆట గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ముఖ్యంగా కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. గీతూ ఈ వీడియోలో..............

Galatta Geetu : పాజిటివ్ గా ప్రమోట్ చేయమని 25 వేలు ఇచ్చా.. బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక సంచలన విషయాలు చెప్పిన గీతూ..

Galatta Geetu sensational comments on her biggboss journey

Updated On : November 11, 2022 / 7:07 AM IST

Galatta Geetu :  బిగ్‌బాస్‌ లోకి వెళ్లిన వాళ్ళు ఎలిమినేట్ అయి వచ్చాక ఇంటర్వ్యూలు, టీవీ షోలలో పాల్గొంటూ వాళ్ళు చేసే హడావిడి తెలిసిందే. కొంతమంది బిగ్‌బాస్‌ పై, కొంతమంది అందులో కంటెస్టెంట్స్ పై కామెంట్స్ చేస్తూ కొన్ని కొన్ని సంచలన విషయాలు మాట్లాడతారు. ఇదే కోవలో తాజాగా ఇటీవలే బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చిన గీతూ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది.

బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక గీతూ ఎవరికీ ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. హౌజ్ లో తను చేసిన ఓవరాక్షన్ వల్లే బయటకి వచ్చేసిందని అందరికి తెలుసు. హౌజ్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఏడ్చి మరింత ఓవరాక్షన్ చేసి సింపతీ కోసం కూడా ట్రై చేసింది. ఇన్ని సీజన్స్ లో బిగ్‌బాస్‌ నుంచి బయటకి వెళ్ళేటప్పుడు ఎవరూ ఇలా ఏడవలేదు. దీంతో గీతూ బయటకి వచ్చాక కూడా తను మరింత ఫేమ్ అవ్వాలని బాగా ప్లాన్ చేసుకుంది అని అంతా అనుకుంటున్నారు. తాజాగా అప్లోడ్ చేసిన వీడియోలో తన బిగ్‌బాస్‌ జర్నీ గురించి మాట్లాడింది. ఇందులో కూడా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది.

ఈ వీడియోలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ గురించి, తన గురించి, తన ఆట గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ముఖ్యంగా కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. గీతూ ఈ వీడియోలో.. ”నాకు మా ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేశారు. మా అమ్మ హౌజ్ లోకి వెళ్లేముందే చెప్పింది స్ట్రైట్ గా ఉంటే ఎవరికీ నచ్చువు, కొంచెం అందరితో మంచిగా ఉండు అని, అయినా నేను వినలేదు. ఇప్పుడు బయటకి వచ్చాక తెలిసింది దానివల్లే నేను బయటకి వచ్చేశానని.”

BiggBoss 6 Day 67 : చెత్త సంచాలక్ రేవంత్.. రోహిత్ వర్సెస్ రేవంత్..

”బిగ్‌బాస్‌ హౌజ్ లోకి వెళ్లే ముందు అందరూ వాళ్ళని ప్రమోట్ చేయడానికి కొంతమంది PR లని పెట్టుకుంటారు. వాళ్లకి డబ్బులిచ్చి వాళ్ళ గురించి ప్రమోట్ చేయించుకుంటారు. నేను కూడా ఒకరికి నన్ను ప్రమోట్ చేయమని, నా గురించి పాజిటివ్ గా కామెంట్స్ చేయమని రూ. 25 వేలు ఇచ్చాను. కానీ వాళ్ళు డబ్బులు తీసుకొని పని చేయకుండా మోసం చేశారు. చాలా మంది నా గేమ్ ని తప్పు పడుతున్నారు. గత సీజన్లలో కూడా కొంతమంది ఇలా ఆడారు” అని తెలిపింది. దీంతో ఈ వీడియోలో గీతూ మాట్లాడిన పలు అంశాలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు అనే మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇది బిగ్‌బాస్‌ పై కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.