Early Menopause : ఎర్లీ మోనోపాజ్ గుండె జబ్బులకు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందా?

రుతువిరతి అనేది స్త్రీ యొక్క పునరుత్పత్తి, హార్మోన్ల చక్రాలు నెమ్మదించేలా చేస్తుంది, పీరియడ్స్ చివరికి ఆగిపోతాయి. అండాశయాలు ఫలదీకరణం కోసం గుడ్లు విడుదల చేయడం ఆపివేసి, తక్కువ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. గర్భం వచ్చే అవకాశం ముగుస్తుంది. 45 మరియు 55 సంవత్సరాల మధ్య చాలా మంది స్త్రీలలో జరిగే సహజ ప్రక్రియ ఇదే.

Early Menopause : ఎర్లీ మోనోపాజ్ గుండె జబ్బులకు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందా?

oes early menopause increase the risk of heart disease_

Updated On : August 14, 2022 / 3:13 PM IST

Early Menopause : మహిళల్లో గుండె జబ్బుల మరణాలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. 40 ఏళ్లలోపే మెనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. గుండె సంబంధిత వ్యాధులు సాధారణంగా పురుషుల్లో తక్కువ వయస్సులోనే వస్తుండగా మహిళల్లో మోనోపాజ్ దశ తరువాత కనిపిస్తుంటాయి. పనివత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం, ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో 40 సంవత్సరాల లోపు మహిళల్లో అకాల రుతువిరుతి సమస్యలు ఎదురవుతున్నాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

రుతువిరతి అనేది స్త్రీ యొక్క పునరుత్పత్తి, హార్మోన్ల చక్రాలు నెమ్మదించేలా చేస్తుంది, పీరియడ్స్ చివరికి ఆగిపోతాయి. అండాశయాలు ఫలదీకరణం కోసం గుడ్లు విడుదల చేయడం ఆపివేసి, తక్కువ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. గర్భం వచ్చే అవకాశం ముగుస్తుంది. 45 మరియు 55 సంవత్సరాల మధ్య చాలా మంది స్త్రీలలో జరిగే సహజ ప్రక్రియ ఇదే. సాధారణంగా పిరియడ్స్ సజావుగా సాగుతున్న సమయంలో మహిళల్లో మంచి , చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలు సమతుల్యంగా ఉంటాయి. దీని వల్ల గుండెల జబ్బుల ప్రభావం పెద్దగా ఉండదు. అయితే అకస్మాత్తుగా పిరియడ్ష్ ఆగిపోయిన వారిలో చెడు కొలెస్ట్రాల్ తోపాటుగా , ట్రైగ్లిజరైడ్స్ మోతాదులు పెరగటం వల్ల కార్డియోవాస్కులర్ సమస్యలు పెరుగుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు 65 సంవత్సరాలకు పైబడిన వారిలో ఉండగా ప్రస్తుతం 45 ఏళ్ళ లోపు వారిలో ఎర్లీ మోనోపాజ్ కారణంగా కనిపిస్తున్నాయి.

కొంత మంది మహిళల్లో పునరుత్పత్తి అవయవాలను తొలగించడం వంటి శస్త్రచికిత్స ల కారణంగా రుతువిరుతికి లోనవుతారు. అలాగే దూమపానం, మద్యపానం చేసే అలవాట్లు ఉన్నవారు త్వరగా మోనోపాజ్ దశకు చేరుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అలాంటి అలవాట్లు ఉన్నవారు మానుకోవటం మంచిది. చాలా మంది మహిళ్లలో మోనోపాజ్ తరువాత ఛాతీనొప్పి, వికారం, గుండెల్లో మంట, దడ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. త్వరగా అలసి పోవటం, ఊపిరి ఆడకపోవటం, వంటి సమస్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్పప్పుడు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి తగిని చికిత్స పొందటం మంచిది.