New Year 2022 : నూతన సంవత్సరం వేళ తప్ప తాగి రోడ్డుపై రచ్చ చేసిన యువతి

నూతన సంవత్సరం ప్రారంభ వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో  పలువురు  పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

New Year 2022 : నూతన సంవత్సరం వేళ తప్ప తాగి రోడ్డుపై రచ్చ చేసిన యువతి

Drunken Woman In Banjara Hills

Updated On : January 2, 2022 / 12:09 PM IST

New Year 2022 :  నూతన సంవత్సరం ప్రారంభ వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో  పలువురు  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల మహిళలుకూడా  మోతాదుకు మించి మద్యం సేవించి పోలీసు విధులను అడ్డకున్నారు.

బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్ వద్ద చేపట్టిన డ్రంక్ అండ్ డ్రయివ్ లో 30 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రయివ్ లో మద్యం సేవిచింన యువతులు పోలీసులను  బేఖాతరు చేయకుండా నెట్టివేశారు. బంజారా హిల్స్ గ్రీన్ బావర్చి వద్ద పోలీసులు తనిఖీలలో 12 మంది మద్యం సేవించి వాహానం నడుపుతూ పట్టుబడ్డారు.
Also Read : Omicron Variant : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్‌ టెన్షన్.. దుబాయ్‌ నుంచి వచ్చిన పలువురికి వేరియంట్
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 వ తేదీ రాత్రి బార్లు, పబ్ లు, హోటళ్లలో మద్యం సేవించి రోడ్ల పైకి వచ్చిన వారిని పోలీసులు బ్రీత్ ఎనలైర్లతో పరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో ఒక మహిళ బ్రీత్ ఎవరైజ్ కు అంగీకరించక రోడుపై హంగామా సృష్టించింది. ఆమెతో పాటు ఉన్న ఆమె స్నేహితుడు కూడా పరీక్షలకు అంగీకరించక…. పోలీసులను తోసుకుంటూ వెళ్లిపోయారు. దాదాపు అరగంటసేపు కొనసాగిన ఈ వాగ్వాదంలో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆ తతంగం మొత్తాన్ని సుర్యారెడ్డి అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టే చేశారు.