presidential election 2022: అందుకే నాకు ఈ ఎన్నికలో ఓటు వేయండి: యశ్వంత్ సిన్హా
ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి తనకు ఓటు వేయాలని ఆయన కోరారు. తాను లౌకికవాదాన్ని కూడా కాపాడతానని చెప్పారు. తాను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఏజన్సీలపై కూడా పోరాడుతున్నానని ఆయన అన్నారు. ఆ ఏజన్సీలు ఇప్పుడు చాలా బలవంతమయ్యాయని, పార్టీలను విడగొడుతున్నాయని వమిర్శించారు. ఓటును బలవంతంగా వేయించుకుంటున్నాయని చెప్పారు.

Yashwant
presidential election 2022: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలో విపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనదని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా? ఇక్కడితో ముగియాలా? అని అన్నారు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఓటింగ్ జరుగుతోందని గుర్తుచేశారు. విచక్షణతో ఆలోచించి ఓట్లు వేస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు.
England vs India: రిషబ్ పంత్ అద్భుత ఆటతీరుపై సచిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్రశంసల జల్లు
ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి తనకు ఓటు వేయాలని ఆయన కోరారు. తాను లౌకికవాదాన్ని కూడా కాపాడతానని చెప్పారు. తాను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఏజన్సీలపై కూడా పోరాడుతున్నానని ఆయన అన్నారు. ఆ ఏజన్సీలు ఇప్పుడు చాలా బలవంతమయ్యాయని, పార్టీలను విడగొడుతున్నాయని వమిర్శించారు. ఓటును బలవంతంగా వేయించుకుంటున్నాయని చెప్పారు. ఇందులో డబ్బుతోనూ ఆటలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.