Elephant Attack : వామ్మో.. ఫోటో షూట్‌లో ఏనుగు బీభత్సం, పరుగులు తీసిన జనం.. వీడియో వైరల్

కేరళలోని గురువాయూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. వెడ్డింగ్ ఫొటో షూట్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. కోపంతో ఊగిపోయింది. దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.

Elephant Attack : వామ్మో.. ఫోటో షూట్‌లో ఏనుగు బీభత్సం, పరుగులు తీసిన జనం.. వీడియో వైరల్

Updated On : November 27, 2022 / 12:37 AM IST

Elephant Attack : ఒక్కోసారి ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. మనం ఒకటి అనుకుంటే, మరొకటి జరుగుతుంది. ఊహకందని విధంగా కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. ఆ కొత్త పెళ్లి జంటకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ ఏనుగుతో వెడ్డింగ్ ఫొటో షూట్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. కోపంతో ఊగిపోయింది. దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.

Also Read : Viral Video: డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండానే స్టీరింగ్ తిప్పి ట్రక్కు పార్కింగ్ చేసిన డ్రైవర్.. వైరల్ అవుతున్న వీడియో

కేరళలోని గురువాయూర్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఈ నెల 10న ఆలయంలోని ఓ ఏనుగుతో ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫొటో షూట్ చేసింది. ఏనుగు సమీపంలో నిల్చుని దంపతులు ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇంతలో ఏం జరిగిందో కానీ, ఏనుగులో కోపం కట్టలు తెంచుకుంది.

Also Read : Viral Video: బైకుపై పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ సాహసం… వైరల్ అవుతున్న వీడియో

అంతే.. మావటి (ఏనుగును నియంత్రించే వ్యక్తి)పై తొండంతో దాడి చేసింది. ఎత్తి కింద పడేసింది. ఈ క్రమంలో మావటి దుస్తులు ఊడిపోయాయి. అయితే, అతడు ఏనుగు దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. భయంతో పరుగులు తీశారు. ఫొటో షూట్ తీయించుకుంటున్న దంపతులు, వారి బంధువులు కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.