Subodh Sahai: మోదీ కూడా హిట్లర్‌లానే.. ప్రధానిపై కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు

బీజేపీ పాలనపై, మోదీపై కాంగ్రెస్ నేత సుబోధ్ సహాయ్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది దోపిడీదారుల ప్రభుత్వం. మోదీ రింగ్ మాస్టర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారు. హిట్లర్‌ను మోదీ దాటేశాడు. హిట్లర్ కూడా తన సైన్యంలో ‘ఖాకి’ అనే ఒక విభాగాన్ని తయారు చేశాడు.

Subodh Sahai: మోదీ కూడా హిట్లర్‌లానే.. ప్రధానిపై కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు

Subodh Sahai

Updated On : June 20, 2022 / 7:46 PM IST

Subodh Sahai: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ కూడా హిట్లర్‌లాగే మరణిస్తాడని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడటం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ అన్నారు. బీజేపీ పాలనపై, మోదీపై కాంగ్రెస్ నేత సుబోధ్ సహాయ్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది దోపిడీదారుల ప్రభుత్వం. మోదీ రింగ్ మాస్టర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారు. హిట్లర్‌ను మోదీ దాటేశాడు. హిట్లర్ కూడా తన సైన్యంలో ‘ఖాకి’ అనే ఒక విభాగాన్ని తయారు చేశాడు. మోదీ ఇలాగే హిట్లర్‌ను అనుసరిస్తే.. ఆయనలాగే మోదీ కూడా మరణిస్తాడు’’ అంటూ సుబోధ్ వ్యాఖ్యానించారు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అయితే, ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఖండించారు. తాము సుబోధ్ వ్యాఖ్యలను అంగీకరించబోమన్నారు. మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా తాము నిరంతరం ఉద్యమిస్తామని, గాంధేయవాదంలోనే తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. కాగా, సుబోధ్ వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది. కాంగ్రెస్ ఎంత చిరాకుపడ్డప్పటికీ, దేశ ప్రజలు మోదీని మళ్లీ మళ్లీ ప్రేమిస్తూనే ఉంటారని బీజేపీ వ్యాఖ్యానించింది.