Fake Ipl: ఐపీఎల్ పేరుతో ఘరానా మోసం.. నకిలీ లైవ్ మ్యాచులతో బెట్టింగ్
అన్ సీజన్‌లో ఫేక్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించి, మ్యాచుల్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా వీక్షకుల్ని నమ్మించి బెట్టింగ్ కూడా నిర్వహించారు. ఆ డబ్బులు కాజేశారు. ఈ ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది.

Fake Ipl (1)
Fake Ipl: వీళ్ల తెలివితేటల గురించి తెలుసుకుంటే ఔరా అనకుండా ఉండలేరు. అన్ సీజన్‌లో ఫేక్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించి, మ్యాచుల్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా వీక్షకుల్ని నమ్మించి బెట్టింగ్ కూడా నిర్వహించారు. ఆ డబ్బులు కాజేశారు. ఈ ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది. గుజరాత్‌లోని మోహ్సానా జిల్లా, మోలిపూర్ గ్రామ యువకులు యూట్యూబ్‌లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య
ఐపీఎల్ ఎప్పుడో ముగిసింది కదా అనుకుంటున్నారేమో.. దీని కోసమే వాళ్లు తమ తెలివితేటలు వాడారు. ఏకంగా ఫేక్ ఐపీఎల్ టోర్నమెంట్ సృష్టించారు. స్థానికంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఒక గ్రౌండ్, పిచ్ ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు రోజుకు రూ.400 ఇచ్చి వాళ్లతో మ్యాచ్ నిర్వహించారు. వీళ్లకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ధరించే జెర్సీలు కూడా ఇచ్చారు. మ్యాచ్‌లు షూట్ చేయడానికి ఐదు హెచ్‌డీ కెమెరాలను వాడారు. అలాగే ఫేక్ అంపైర్లను ఏర్పాటు చేసి, వారి చేతికి వాకీటాకీలు ఇచ్చారు. వీక్షకుల్ని నమ్మించేలా డీఆర్ఎస్, రనౌట్ల గురించి చర్చించుకునేలా చేయమన్నారు. ఇవన్నీ చేయడానికి వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు నిర్వాహకులు ఇచ్చే ఆదేశాలను కూడా ఫాలో అవ్వాలి.
Crocodile: నదిలో స్నానానికి వెళ్లిన బాలుడు.. మింగేసిన మొసలి
ఇవన్నీ సరే.. ప్రేక్షకుల సంగతేంటి అంటారా.. దీనికీ తమ తెలివితేటలు వాడారు. రెండేళ్లక్రితం దుబాయ్‌లో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ జరిగిన సంగతి తెలిసిందే కదా. అలాగే ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి టెక్నాలజీనే వాడి ప్రేక్షకుల్ని నమ్మించారు. ఫేక్ కామెంటేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మిమిక్రీ ఆర్టిస్టు. ప్రముఖ కామెంటేటర్ హర్షాభోగ్లేలా మిమిక్రీ చేసే కళాకారుడితో లైవ్ కామెంట్రీ చెప్పించారు. ఇలాంటి అసాధారణమైన ఏర్పాట్లతో రష్యాలో ఉన్న బెట్టింగ్ వీరులు మ్యాచ్‌లు చూసేందుకు వాటిని లైవ్ టెలికాస్ట్ చేసేవాళ్లు. ఇదంతా నిజమని నమ్మిన రష్యా బెట్టింగ్ వీరులకు టెలిగ్రామ్ లింకులు పెట్టేవాళ్లు. చెన్నై, ముంబై, గుజరాత్ టీములపై రష్యన్లు బెట్టింగులు కాసేవాళ్లు. షోయబ్ దేవ్‌డా అనే వ్యక్తి ఈ బెట్టింగ్ తతంగాన్ని నిర్వహించాడు.
Nadendla Manohar: సీఎంను నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమం: నాదెండ్ల
రష్యాలోని పబ్బులకు వెళ్తూ, అక్కడి వాళ్లకు క్రికెట్ గురించి, బెట్టింగ్ గురించి వివరించేవాడు. దీంతో క్రికెట్ మీద అవగాహన లేని రష్యన్లు అతడ్ని నమ్మి బెట్టింగ్ కాశారు. అలా రష్యన్లు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు బెట్టింగ్ రూపంలో వసూలు చేశారు. లేని మ్యాచుల కోసం బెట్టింగ్ కాసి, రష్యన్లు మోస పోయారు. అయితే, ఈ బెట్టింగ్ వ్యవహారం మెల్లిగా బయటకు తెలిసింది. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. విచారణ జరిపి, నకిలీ ఐపీఎల్ ఛానల్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో విశేషం ఏంటంటే ఈ ఫేక్ టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ దాటి, క్వార్టర్స్‌కు చేరుకుందట.