Fire breaks In Delhi : ఢిల్లీలో మరో భారీ అగ్రిప్ర‌మాదం..

దేశ రాజధాని ఢీల్లీలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈక్రమంలో నైరుతి ఢిల్లీలోని ఘుమాన్ హేరా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire breaks In Delhi : ఢిల్లీలో మరో భారీ అగ్రిప్ర‌మాదం..

Fire Breaks In Delhi

Updated On : February 2, 2022 / 12:19 PM IST

Fire breaks at Delhi factory : దేశ రాజధాని ఢీల్లీలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈక్రమంలో మరోసారి ఢిల్లీలో అగ్నిప్రమాదం సంభవించింది. నైరుతి ఢిల్లీలోని ఘుమాన్ హేరా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం (ఫిబ్రవరి 2,2022)భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీనిపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావటానికి తీవ్రంగా శ్రమించారు.అలా ఉద‌యం 7:30 గంట‌ల‌ స‌మ‌యానికి మంట‌లు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.

ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగటం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెరేటం వల్ల ప్రమాదం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మంటలను ఆర్పేందుకు దాదాపు పది అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. రెండు గంటల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రాణనష్టం జరగకుండా అగ్నిమాపక శాఖ ఫ్యాక్టరీని ఖాళీ చేయించింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేసేందుకు స్థానిక పోలీసులు కూడా అగ్నిమాపక స్థలానికి చేరుకుని సహాయం చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో జరిగిన మొత్తం నష్టాన్ని స్థానిక పోలీసులు అంచనా వేసి ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు అధికారులు.