Flight Charges Hike : ఆ రూట్లలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. అమెరికా పోయేదెట్టా..

విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఇండియాకు వెళ్లొద్దని అమెరికా సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో రన్ అయ్యే విమానాల టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Flight Charges Hike : ఆ రూట్లలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. అమెరికా పోయేదెట్టా..

Flight Charges Hike After Usa Declares Not To Go India (1)

Updated On : April 26, 2021 / 7:28 AM IST

Flight Charges Hike : విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఇండియాకు వెళ్లొద్దని అమెరికా సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో రన్ అయ్యే విమానాల టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారత్‌-అమెరికా సర్వీసుల్లో ఎకానమీ క్లాస్‌ టికెట్‌ సగటున రూ.50 వేలుగా ఉంది. ప్రస్తుతం రూ.1.5 లక్షలు వసూలు చేస్తున్నాయి.

భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేగాని జరిగితే స్వదేశంలోనే ఉండిపోవాల్సి వస్తుందన్న భయంతో చాలామంది అమెరికాకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు.

అమెరికా ప్రకటనలో విమాన టికెట్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. జర్మనీ, యూకే, యూఏఈ సహా పలు దేశాలు కూడా భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దేశంలో ఛార్టర్డ్‌ విమానాలకు అధిక డిమాండ్‌ ఏర్పడింది.