తరచూ జర్నీ చేసేవాళ్లే హ్యాపీ.. వేకేషన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్

తరచూ జర్నీ చేసేవాళ్లే హ్యాపీ.. వేకేషన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్

Updated On : January 9, 2021 / 8:20 PM IST

Frequent travellers: మీరు జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. టూరిజం అనాలసిస్ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. తరచుగా జర్నీ చేసే వాళ్లు అస్సలు జర్నీ చేయని వాళ్లకంటే చాలా హ్యాపీగా ఉంటున్నారట. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ బిజినెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చుంచు చెన్ ఓ సర్వే నిర్వహించారు.

అందులో ఎవరైతే తరచూ ప్రయాణం చేస్తున్నారో… వారంతా అస్సలు టూరిజం ఎక్స్‌పీరియెన్స్ లేని వాళ్లకంటే హ్యాపీగా ఉన్నారట. ఈ విశ్లేషణలో ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్లు తరచూ జర్నీ గురించి ప్లానింగ్ లు, రెగ్యూలర్ వేకేషన్స్ గురించి చర్చించుకుని సంతోషంగా ఫీలవుతారట.

దాంతో పాటు కనీసం ఇంటికంటే 75మైళ్ల దూరం ప్రయాణించిన వారు 7శాతం ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. వర్క్, కుటుంబం, ఫ్రెండ్స్ లు జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంటారు. ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ చేసిన వారిలో వీరే కాకుండా ఇతరులు కూడా షేర్ చేసుకుంటుండటంతో గమనించదగ్గ మార్పులు చూడొచ్చన్నమాట.

గత స్టడీలు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, క్షేమంగా ఉండటం కోసం టూరిజం అనుభవాలు ఉపయోగపడాయని చెప్తున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 500మందిలో సంవత్సరానికి నాలుగు ట్రిప్పులు వేసిన వారు ఉన్నారు. వారంతా కేవలం కొవిడ్-19 మొదలవడమే వారి ఎటూ కదలనీయకుండా చేసిందని లేదంటే తమ ప్రయాణం ఎలా జరిగేదో వివరణ ఇస్తున్నారు.

ఈ రీసెర్చ్ ప్రకారం.. టూర్లు వెళ్లే వాళ్లు, ఆ వేకేషన్ గురించి ప్లాన్లు చేసుకునేవాళ్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వేకేషన్ గురించి ప్లాన్ చేసుకుంటారేమో..