నేరెడ్‌మెట్‌లో TRS గెలుపు, కంటతడి పెట్టిన బీజేపీ అభ్యర్థి!

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 11:30 AM IST
నేరెడ్‌మెట్‌లో TRS గెలుపు, కంటతడి పెట్టిన బీజేపీ అభ్యర్థి!

Updated On : December 9, 2020 / 11:48 AM IST

GHMC POLLS Neredmet : గ్రేటర్ హైదరాబాద్ నేరెడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపును అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. గెలుపుపై మీనా సంతోషం వ్యక్తం చేయగా..బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఏడుస్తూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తు కాకుండా..మరో సింబల్ ఉండడంతో వివాదం నెలకొంది. దీంతో ఈనెల 04వ తేదీన ఫలితం వెల్లడి కాలేదు. అప్పటికే టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. స్వస్తిక్ గుర్తు కాకుండా..మరో సింబల్స్ ఉంటే..ఎన్నికల రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.



హైకోర్టు ఆదేశాలతో 544 పెండింగ్ ఓట్లను అధికారులు 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం లెక్కించారు. నేరెడ్ మెట్ డివిజన్ లో మొత్తం 56 వేల 92 ఓట్లు ఉన్నాయి. ఈనెల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ జరిగింది. 25 వేల 176 ఓట్లు పోలయ్యాయి. 24 వేల 632 ఓట్లు లెక్కించారు. డిసెంబర్ 04వ తేదీన లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం టీఆర్ఎస్ గెలవడంతో కార్పొరేటర్ల సంఖ్య 56కి చేరింది.